Thursday, July 25, 2024

AFG vs SL : ఆఫ్ఘనిస్థాన్ టార్గెట్ 242 పరుగులు

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వరల్డ్ కప్ లో భాగంగా ఆప్ఘనిస్థాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య 30వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది.

శ్రీలంక జట్టు ఆశించినంత స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 49.3 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లు పతుమ్ నిస్సంహా 46 పరుగులు, కుశల్ మెండిస్ 39 పరుగులు, సదీర సమర విక్రమ 36 పరుగులు, మనీష్ తీక్షణ 39 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 242 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement