Saturday, May 4, 2024

ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో అదానీ.. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ నివేదిక

అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ భారీగా పెరగడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆ కంపెనీ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకారు. 118 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో గూగుల్‌ వ్యవస్థాపకులు లారీపేజ్‌, సెర్గీ బ్రిన్‌లను వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు. అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్‌ ఎనర్జీ దేశంలో అత్యధికమార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. సోమవారం ఒకే రోజు అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.65వేల కోట్లు పెరిగింది. దీంతో గౌతమ్‌ సంపద ఒక్కసారిగా పైకి ఎగబాకింది. లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు కొంత సంపద కోల్పోవడం కూడా గౌతమ్‌ అదానీ పైకి ఎగబాకడానికి కారణం అయ్యాయి.

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్‌ ప్రకారం.. ప్రపంచ కుబేరులా జాబితాలో అదానీ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్‌ ్స రియల్‌టైం బిలియనీర్స్‌ జాబితాలోనూ ఆరో స్థానంలో ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో అదానీ సంపద 41 బి.డాలర్లు పెరిగింది. కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూ రూ.4,22,526.28 కోట్లకు చేరకుంది. రూ.17లక్షల కోట్లతో రిల్‌ టాప్‌లో ఉంది. ఆ తరువాత స్థానాల్లో టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement