Saturday, September 21, 2024

నోరా ఫ‌తేహీకి ట్రోల్స్ – మీ ద‌గ్గ‌ర ప‌ని చేసేవారు మీకు బానిస‌లా నిల‌దీసిన నెటిజన్స్

సినీ సెల‌బ్రిటీలు అంటేనే ల‌గ్జ‌రీ లైఫ్ అనే సంగ‌తి తెలిసిందే. వారు కోరుకున్న‌వి వారి ముందు వ‌చ్చి వాలుతుంటాయి. హీరోల‌తో పాటు హీరోయ‌న్స్ కి కూడా స‌ప‌రియ‌లు చేయాల్సిందే. అయితే సినిమా షూటింగ్ ల‌లోనే కాదు..వారు ఎక్క‌డికి వెళ్లినా వారి వెంట వారిని చూసుకోవ‌డానికి ప‌లువురు స‌ప‌రేట్ గా ఉంటారు. కాగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి చేసిన ప‌నికి నెటిజ‌న్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ పింక్ డిజైనర్ శారీలో మెరిసింది. కారు నుండి అలా కాలు బయటకి పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆమె వెన‌కాలే ఉన్నారు కేర్ టేక‌ర్స్. అప్ప‌టికే వ‌ర్షం ప‌డుతోంది.. నోరాకి గొడుగు పట్టకపోతే తడిసిపోతుంది. ఆ పొడవాటి పవిట కొంగు ఒంటిపై నిలిచేది తక్కువ కాబట్టి నీళ్లలో జారిపడకుండా పట్టుకునేందుకు ఇంకొక గార్డ్ అవసరమయ్యాడు. ఈ సీన్ చూసిన కొందరు నెటిజనులు సీరియస్ అవుతుంటే మరికొందరు అవసరమే కదా అని సమర్థించే వాళ్లు లేకపోలేదు. నోరా ఫతేహి డాన్స్ దీవానే జూనియర్స్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. నీతూ కపూర్ -మార్జీ పెస్టోంజీతో కలిసి నోరా జడ్జిమెంట్ ఇస్తున్నారు.

ఇటీవల షో ముగింపు షూట్ కోసం నోరా పింక్ చీరలో కనిపించింది. ముంబైలో భారీ వర్షాల మధ్య టీమ్ షూటింగ్ చేస్తోంది. నోరా తన టీమ్ సహాయం తీసుకుని కారు దిగి తన వానిటీ వ్యాన్ లోకి చేరుకుంది. ఆ వర్షంలో సెక్యూరిటీ గార్డు నోరాకు చీర తడవకుండా సహాయం చేసాడు. తన వెంటే ఉండి.. ఆ కుచ్చిళ్లను పట్టుకుని తనతోనే వ్యాన్ వద్దకు నడవడం నెటిజనులకు ఆశ్చర్యం కలిగించింది. నిజానికి అదే ఎవరికీ నచ్చలేదు. దీనిపై తనను ట్రోల్ చేశారు. కొందరు నోరాను ఈ వైఖరి ఏంటీ అని ప్రశ్నించారు. చీరను మోసుకెళ్ళడంలో సహాయం చేసినందుకు గార్డును.. నోరాను కూడా పలువురు నిందించారు.ఈ వీడియోపై స్పందిస్తూ ఒక నెటిజన్ ఇలా రాశాడు..మీకు మీరు అదుపులో వుంచుకోగలిగే దుస్తులను ధరించండి అని రాయగా.. మరొకరు కాపలాదారుని బానిసగా ఉపయోగించుకోకండి.. సిగ్గుపడండి అని తిట్టాడు. ”ఒక పేద వ్యక్తి ఎల్లప్పుడూ ధనికుడికి మద్దతు ఇచ్చే ధైర్యం కలిగి ఉంటాడు. ఆ అబ్బాయికి హ్యాట్సాఫ్ అని రాసారు. మరో నెటిజను ఇలా అన్నారు. పేదవాడా.. ఆమె చీరను తీసుకువెళ్లడం కోసమే అతను వర్షంలో తడిసిపోయాడు…అని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వీడియో వైర‌ల్ గా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement