Friday, May 3, 2024

జాతీయ జెండాల అమ్మకంపై జీఎస్టీ రద్దు..

జాతీయ జెండాల అమ్మకాలపై జీఎస్టీని రద్దు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించారు. మిషన్‌పైనా, పాలిస్టర్‌ ఎలా తయారు చేసినప్పటికీ జాతీయ జెండాపై ఇక నుంచి జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలోనే చేతితో తయారు చేసిన ఉలెన్‌ జెండాలు, కాటన్‌, సిల్క్‌, ఊల్‌, ఖాదీతో చేసిన జెండాలకు జీఎస్టీని మినహాయించారు. ఇక నుంచి దేనితో తయారు చేసినప్పటికీ జాతీయ జెండాపై జీఎస్టీని వసూలు చేయకూడదని నిర్ణయించారు. ప్లాగ్‌ కోడ్‌ 2002లో ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement