Sunday, May 26, 2024

మహానుభావుడు…ఇంకెక్కడా దొరకాలేదేమో!! ఏకంగా విగ్గులో

బంగారం అక్రమ రవాణా గురించి వినే ఉంటారు. పోలీసుల కంటపడకుండా ఆ బంగారాన్ని రకరకాలుగా ఎవరికీ కనిపించకుండా రవాణా చేస్తూ ఉంటారు. అయితే చెన్నై విమానాశ్రయంలో ఓ వ్యక్తి ఏకంగా నెత్తి పై ధరించిన విగ్గులో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయబోయాడు. కాగా అతనిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్, షార్జా నుంచి వచ్చిన రెండు ప్రత్యేక విమానాలలో అనుమానంగా కొంత మంది కనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు.

కాగా కొంతమంది విగ్గు లలో మరికొంత మంది షాక్స్ లలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు. మొత్తం వీటి విలువ 2.5 3 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement