Saturday, February 24, 2024

మద్యం మత్తులో చెలరేగిన వివాదం.. కత్తితో దాడి, ఒంగోలులో ఘటన

ఒంగోలు క్రైమ్, (ప్రభా న్యూస్) : మద్యం మత్తులో కత్తితో దాడి చేసిన ఘటన స్థానిక నెల్లూరు బస్టాండ్ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో కమల్ అలియాస్ కమలహాసన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కమల్ అలియాస్ కమల్ హాసన్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ బాజీలు తోపుడు బండిపై అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఒంగోలులో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఇద్దరు కలిసి మద్యం సేవించారు.

అనంతరం ఇద్దరు మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఉన్న బాజీ పక్కనే అరటి బండి పై ఉన్న కత్తిని తీసుకొని కమల్ హాసన్ పై దాడి చేశాడు. దాడిలో కమల్ హాసన్ కు రక్త గాయాలయ్యాయి. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి ఉటాహుటిన చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుని అంబులెన్స్ సాయంతో ఒంగోలు జిజిహెచ్ తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement