Tuesday, April 23, 2024

గన్ తో కాల్చుకున్న కానిస్టేబుల్..

కౌటాల రూరల్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో రజినికుమార్ అనే కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకున్నాడు. ఇది గమనించిన అక్కడి సిబ్బంది హుటా హుటిన కాగాజ్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం 4:55 గంటల సమయంలో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకున్నట్లు సమాచారం. కాగా రజినికుమార్ మంచిర్యాల్ జిల్లా గుడిపేట బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement