Sunday, May 26, 2024

heavyrains: ఆప్ఘనిస్థాన్‌లో కురుస్తున్న‌ భారీ వర్షాల‌కు 33 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 33 మంది మృతి చెందారు. ప‌లు ఘ‌ట‌న‌ల్లో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తాలిబన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ వెల్లడించారు. రాజధాని కాబూల్‌తో పాటు పలు ప్రావిన్సులను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని తెలిపారు.

- Advertisement -

దాదాపు 200 పశువులు చనిపోగా, 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. అలాగే వరదల కారణంగా దాదాపు 800 హెక్టార్ల వ్యవసాయ భూమి, 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్లు దెబ్బతిన్నాయి. పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్సుల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement