నేపాల్‌లో 2 కొత్త వేరియంట్‌లు.. బాధితులు ఇద్దరూ విదేశీయులే..

ఖట్మాండు : పొరుగున ఉన్న నేపాల్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్టు ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకంటించింది. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశం నుంచి నవంబర్‌ 19న 66 ఏళ్ల విదేశీయుడు నేపాల్‌లోకి ప్రవేశించాడు. దీంతో అతనికి స్వల్ప లక్షణాలు ఉండటంతో.. పరీక్షలు నిర్వహించారు. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన 71 ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

వీరిద్దరూ.. విదేశీయులు అని, నేపాల్‌ వాసుల్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ వైరస్‌ బయటపడలేదని తెలిపింది. వారిద్దరినీ వేర్వేరు ఐసోలేషన్‌ గదుల్లో ఉంచినట్టు వివరించింది. వైద్యులు నిరంతరం వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. వారితో పరిచయం ఉన్న.. సన్నిహితంగా మెలిగిన 66 మందిని గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 8 ఆఫ్రికన్‌ దేశాల నుంచి రాకపోకలపై కొన్ని రోజుల క్రితమే నేపాల్‌ నిషేధం విధించింది.

Exit mobile version