Monday, June 17, 2024

కేరళలో విషాదం.. బిల్డింగ్ పై నుంచి పడి యువతి మృతి

కేరళలో ఓ 18 ఏళ్ల యువతి 10 అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఇంటి బాల్కనీలో యువతి నిలబడి ఉండగా.. ఒక్కసారిగా జారి పైనుంచి కిందికి పడిపోయింది. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement