Saturday, October 12, 2024

ముంబయి పోర్టులో 1,700 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం

నవీ ముంబైలోని జవహర్‌లాల్‌నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ నుండి ఢిల్లి పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ బృందం హెరాయిన్‌ కోట్‌ చేసిన 20 టన్నుల కంటే ఎక్కువు లికోరైస్‌ ఉన్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 1,750 కోట్లు. గతంలో కూడా రూ. 1,200 కోట్ల విలువైన డ్రగ్స్‌తో ఇద్దరు ఆప్ఘన్‌ జాతీయులు పట్టుబడ్డారు.

ఈ స్వాధీనం మన దేశంపై నార్కో టెర్రరిజం ప్రభావాన్ని చూపుతుంది. మన దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించే వివిధ వ్యూహాలను ఇది తెలియజేస్తోంది” అని ప్రత్యేక పోలీసు కమిషనర్‌ హెచ్‌సిఎస్‌ ధాలివాల్‌ అన్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుందని, దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement