Wednesday, May 1, 2024

TS | ఈనెల 12నుంచి మరో 100 విమెన్‌ హెల్త్‌ క్లీనిక్స్‌.. మహిళా ఆరోగ్య సంరక్షణకు సర్కార్‌ విస్తృత చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ఆరోగ్య మహిళా కేంద్రాలను మరో 100 కేంద్రాల్లో విస్తరించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ నెల 12న వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఇప్పటికే 272 ఉండగా, పెరగనున్న 100 కేంద్రాలతో కలుపుకుని ఇవి 372కు చేరనున్నాయి. దీంతో ఆరోగ్య మహిళా క్లినక్‌ల పెరుగుదలతో మహిళ ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యత, సంరక్షణ లభించనుంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఉంటూ 8 రకాల ప్రధాన వైద్య సేవలు అందుతున్నాయి. తద్వారా ఈ సేవలు మరిన్ని కేంద్రాలకు విస్తరించడంతో మహిళలకు మరింత వెసులుబాటు కల్గనుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement