Friday, May 17, 2024

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణలో పలు సెట్ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రంలో ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్, 23న లాసెట్ జరగనున్నాయి. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇటీవలే ఈ మూడు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్‌, న్యాయవాద విద్య అభ్యసించేందుకు లా సెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement