Tuesday, May 21, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి స్ధిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 178 మందికి కరోనా సోకింది.  అదే సమయంలో ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య  2,98,631కి చేరింది. కరోనా మృతుల సంఖ్య  1,633కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1939 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement