Tuesday, May 28, 2024

ప.గో. జిల్లాలో రోడ్డుప్రమాదం… ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో 16వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలు కాగా క్షతగాత్రులను వెంటనే తణుకు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

కాగా స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న లారీ నల్లజర్ల నుంచి దోపుచర్ల వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. మృతులు ఉంగుటూరు మండలం పందిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement