Thursday, April 18, 2024

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ కన్నుమూత

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్(88) బుధవారం ఉదయం కన్నుమూశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 1950-60 కాలంలో భారత్ నుంచి స్టార్ ప్లేయర్‌గా వెలుగొందారు. తన కెరీర్‌లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ అందుకున్నారు. ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్ 3గా కొంతకాలం కొనసాగారు. 1961లో అర్జున అవార్డు అందుకున్నారు. కాగా నందు నటేకర్ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీలతో పాటు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.

బ్యాడ్మింటన్ విభాగంలో నందు నటేకర్ అందుకున్న మైలురాళ్లు:
★ 1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో విజయం
★ 1954లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిక
★ థామస్‌ కప్‌లో 16 సింగిల్స్‌ మ్యాచ్‌లో 12 విజయాలు.. అలాగే టీమ్‌ తరపున 16 డబుల్స్‌ మ్యాచ్‌ల్లో 8 విజయాలు
★ బ్యాడ్మింటన్‌లో సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రదానం చేసింది.
★ 1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు నందు నటేకర్ ప్రాతినిధ్యం వహించారు.

ఈ వార్త కూడా చదవండి: రెండో పెళ్లికి సిద్ధమవుతున్న హీరో సుమంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement