Monday, April 15, 2024

పాలమూరు : మొక్కలు నాటి కేసీఆర్ కు కానుక

  గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని, అందుకు తన వంతుగా అన్ని విధాలుగా సహకరిస్తానని  కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన  కెసిఆర్‌ పథకాలతో సర్పంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించాలన్నారు.  కెసిఆర్‌ పుట్టిన రోజును  పురస్కరించుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసేందుకు ఇదొక్కటే మార్గమని అన్నారు. మొక్కలను నాటి కెసిఆర్‌కు జన్మదిన కానుకగా ఇవ్వాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement