Tuesday, May 28, 2024

న్యూఢిల్లీ : అసోం డీఎస్పీ హిమాదాస్

 భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమాదాస్‌ (21) అసోంలో డీఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది.ఈ విషయా న్ని అసోం పోలీస్‌ శాఖ ట్విటర్‌ వేదికగా వెల్లడిం చింది. ఈ సందర్భంగా హిమాదాస్‌ మాట్లా డుతూ పోలీస్‌ కావాలనేది తన చిన్ననాటి కలగా పేర్కొం ది. తన తల్లి కూడా ఇదే కోరు కునేదని తెలిపింది. తన కల నెరవేరిందని అయితే అథ్లెట్‌గానే తన కెరీర్‌ను కొనసాగిస్తాను అని హిమాదాస్‌ వెల్లడిం చింది. కాగా హిమాదాస్‌ డీఎస్పీగా బాధ్య తలు స్వీకరించడంపై అసోం ముఖ్యమంత్రి సోనోవాల్‌ స్పందించారు. ఆమెకు అభినం దనలు తెలుపుతూ ఈ నియామకం ద్వారా క్రీడారంగంలో రాణించాలనే ఇతర యువతకు హిమాదాస్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement