Thursday, February 8, 2024

Editorial: ఇండియా కూటమిలో కుంపట్లు

విభిన్న రాజకీయ దృక్పథాలుకలిగిన పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ఎన్నిక లకు ఇంకా చాలా ముందే కకావికలమైంది. ఆ కూటమి ఏర్పడి ఇంకా ఆరునెలలైనా కాలేదు. రెండు ప్రధాన పార్టీ లు ఇప్పటికే కూటమికి దూరమయ్యాయి. జనతాదళ్‌ (యు) నాయకుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఏకంగా కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమిలో చేరారు.

- Advertisement -
   

ఇండియా కూటమికి ఆదిలోనే హంస పాదులా చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో ఎదురుదెబ్బ తగిలింది.ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కొనసా గుతుందని అంటూనే 16 సీట్లకు తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ లు జరుగుతున్నాయని ప్రకటిస్తూనే ఈ 16 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను అఖిలేష్‌ ప్రకటించడం పట్ల కాంగ్రెస్‌ ఆక్షేపణ తెలిపింది. కాంగ్రెస్‌కి 11 స్థానాలను ఆయన ఇవ్వ జూపడాన్ని ఆ పార్టీ తోసిపుచ్చింది. మరో వంక పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇండియా కూటమి లో కొనసాగుతూనే కాంగ్రెస్‌కి రెండ ు లోక్‌సభ సీట్లకు మించి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తోంది.గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ రెండు సీట్లను మాత్రమే గెల్చుకున్న సంగతి తెలిసిందే.అలాగే, కాంగ్రె స్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ జరుపుతున్న భారత్‌ జోడో న్యాయయాత్రలో తమ పార్టీ కార్యకర్తలు పాల్గొన బోరని మమత ఇంతకుముందు ప్రకటించారు. అదే విధంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) కూడా రాహుల్‌ యాత్రలో తమకార్య కర్తలు పాల్గొనబోరని ప్రకటించింది.

గత ఏడాది చివర లో జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ తన అభ్యర్ధులను నిలబెట్టినప్పుడు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వలేదు.దాంతో ఆగ్రహించిన సమాజ్‌ వాదీ పార్టీ ఇప్పుడు బదులు తీర్చుకుంటోంది. అప్పట్లో అఖిలేష్‌- వకిలేష్‌ ఎవరో తనకు తెలియదంటూ మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు కమలనాథ్‌ చేసిన వ్యాఖ్యకు అఖిలేష్‌ నొచ్చుకున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే, ఆ పార్టీ కోరినన్ని సీట్లను ఇవ్వడానికి నిరాకరి స్తున్నారు.అలాగే, అఖిలేష్‌ యాదవ్‌ ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ యత్నాలు కొనసాగిస్తోంది. ఈ కారణంగా ప్రతిష్టాత్మకమైన రాయ బరేలీ స్థానాన్ని సైతం ఇవ్వదేమోనన్న అనుమానం కాంగ్రెస్‌ నాయకుల్లో బయలుదేరింది.ఈ స్థానానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేథీ నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ ఓడి పోయారు. ఆయన కేరళలోని వయనాడ్‌లో క్రిందటి సారి విజయం సాధించారు.

ఈసారి కూడా అక్కడే పోటీ చేయాలని ఆయనపై పార్టీ శ్రేణులనుంచి ఒత్తిడి వస్తోంది.అయితే, సోనియాకానీ, రాహుల్‌ కానీ, ఇంకా నిర్ణయించుకోలేదు.ఇండియా కూటమిలో నికరంగా మిగిలే పార్టీలు లాలూప్రసాద్‌ నేతృత్వంలోని ఆర్‌జేడీ. ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలోని డిఎంకె. ఈ రెండు పార్టీల తో కాంగ్రెస్‌ పొత్తుకుదుర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ పార్టీలు కోరినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌కి అభ్యంతరం లేదు. బీహార్‌లో కులగణనను అమలు జరపాలని తమ పార్టీ, వద్దని బీజేపీ ఒత్తిడి తేవడం వల్లనే నితీశ్‌ తమ కూటమినుంచి బయటికివెళ్ళిపోయారని రాహుల్‌ అంటున్నారు. నితీశ్‌ లేకపోయినా, బీహార్‌లో మహాఘటబంధన్‌ సీట్లసర్దుబాటుచేసుకోగలదనీ, సామాజిక న్యాయం అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రచారం చేస్తామని ఆయన అంటున్నారు. ఇండియా కూటమిలో ఒడిషా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ చేరుతారోలేదో తెలియదు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయా లపై ఆధారపడి ఉంటుంది.

అక్కడ ఆయన అన్న కుమారుడు అజిత్‌పవార్‌ ఎన్సీపీ చీలిక వర్గం నాయకునిగా ఏక్‌నాథ్‌ షిండేమంత్రివర్గంలో ఉప ముఖ్యమం త్రి హోదాలో కొనసాగుతున్నారు. ఆయన వేరుపడటం తో ఎన్సీపీ ఇంతకుముందే బలహీనపడింది. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను సంప్రదించకుండా రాహుల్‌ గాంధీ జోడోన్యాయయాత్రను ప్రారంభించ డం వల్ల సెక్యులర్‌ పార్టీలకు గుర్రుగా ఉంది. ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటికి వచ్చేందుకు ఆలోచనలు చేయడానికి ముఖ్యకారణం ఇదే. ఇండియా కూటమి నేతృత్వాన్ని నితీశ్‌ ఆశించారు. అయితే కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే పేరును ఖరారు చేయడం ఆయన అసంతృప్తికి కారణం. అంతేకాక ఇండియా కూటమిలో నాయకులు పరస్పరం సంప్ర దించుకోకుండా ప్రకటనలు చేయడం కూడా ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కూటిమి నాయకులంతా ఎవరిమటుకు వారు ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నవారే.

Advertisement

తాజా వార్తలు

Advertisement