Friday, October 11, 2024

Editorial – ఇక సూర్య‌యాన్ ..

ఒక విజయం వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ప్రపంచంలో అగ్రరాజ్యం సహా ఏ దేశమూ సాధించలేని విజయాన్ని సాధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) మరిన్ని విజయాల కోసం జాంబవంతుని అంగతో ముందుకు సాగేందుకు ప్రణాళికలను రూపొం దిస్తోంది. చంద్రయాన్‌మిషన్‌-3 విజయవంతం కావ డంతో భారత్‌కి ఎనలేని కీర్తి వచ్చింది.అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలూన లేకపోయాయి. అంతటి మహత్తర మైన ఘనత మన ఇస్రోకే దక్కింది. యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ సహా పలు అంత ర్జాతీయ సంస్థలు ఇస్రోని ప్రశంసించాయి.ఈ విజయ స్ఫూర్తితో ఆదిత్య మిషన్‌ని వచ్చే నెలలో ప్రారంభిం చ నున్నామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ గురువారం వెల్లడించారు.2025 నాటికి రోదసిలోకి మనిషిని పంపిం చే యత్నాలను ముమ్మరం చేయనున్నామని కూడా ప్రక టించారు.

తరతరాలుగా మనకు ప్రత్యక్ష దైవాలు సూర్య చంద్రులు.వారి నుంచి పొందే కాంతి, వేడిమి, చల్లదనం మనిషి మనుగడకు ఆధారం అవుతోంది. అటువంటి ప్రత్యక్ష దైవాల వద్ద ఇంకా ఏమేమి శక్తులున్నాయో వాటిని పొందాలనే తహతహ మనుషుల్లో ఉండటం సహజం. సూర్యరశ్మి వల్ల మనం పొందుతున్న ప్రయోజ నాలను గురించి మాటల్లో వర్ణించలేం. సౌరశక్తి వల్ల మన ఇంధనం ఖర్చు చాలా వరకూ ఆదా అవుతోంది. సూర్య కిరణాల ప్రభావంతో ఇప్పటికే ఎన్నోరోగాలను నయం చేయగలుగుతున్నారు మన వైద్యులు. పూర్వ కాలం నుంచి సూర్యుణ్ణి మన పెద్దలు ఆరోగ్య ప్రదాతగా అభివర్ణిస్తూ వస్తున్నారు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన పెద్దలు పాటించి చూపిన సంప్రదాయం.

అటువంటి సూర్య భగవానునిపై కూడా ప్రయోగాలు చేయాలన్న ఆకాంక్ష ఎప్పటి నుంచో ఉంది. చంద్రయాన్‌-3 విజయంతో లభించిన స్ఫూర్తితో ఆదిత్య మిషన్‌ను ప్రారంభించేందు కు ఇస్రో ఆలోచనలకు కార్యరూపం ఇవ్వనున్నది. అలాగే, రోదశిలోకి అమెరికా వ్యోమగాములను ఐదు న్నర దశాబ్దాల క్రితమే పంపింది.ఎప్పటికైనా మన దేశం కూడా మనుషులను పంపాలన్న ఆకాంక్షను నెరవేర్చు కునేందుకు ఇప్పుడు తగిన సమయం వచ్చింది. సాంకేతి క పరిజ్ఞానం లభించింది. కనుక దానిని సద్వినియోగం చేసుకునేందుకు ఇస్రో ప్రయత్నాలను ముమ్మరం చేస్తోం ది.. చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడంతో మన సాంకేతిక సామర్ధ్యం, వ్యోమనౌక నాణ్యత అంత ర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాయి. మన శాస్త్రవేత్త లు డబ్బు,పేరు, ప్రతిష్టల కోసం కాకుండా దేశానికి మంచి పేరు తేవాలన్న ఆకాంక్షతోనే పగలు,రాత్రి తేడా లేకుండా కష్టించి పనిచేశారు. చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిపుణులు, శాస్త్రవేత్తల వేతనాలతో పోలిస్తే మన వారి వేతనాలు తక్కువే. అయినప్పటికీ, వారెప్పుడూ అలాంటి లెక్కలు వేసుకోలేదు. ఇతర దేశా ల్లో కన్నా 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చుతోనే ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తోంది.

విజయవంతంగా ప్రయోగిం చబడిన చంద్రయాన్‌-3 మిషన్‌కి అయి ఖర్చు 615 కోట్ల రూపాయిలు మాత్రమే. ఇది హాలీవుడ్‌ చిత్రాల బడ్జెట్‌ కన్నా బాగా తక్కువ. అంతేకాదు, ప్రభుత్వం తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నందుకు వాటిని ఈడేర్చాలన్న ఆకాంక్ష, అకుంటిత దీక్ష వారిలో ఉంది. 30 ఏళ్ళ క్రితం పీఎస్‌ఎల్‌వికి వినియోగించిన ఇంజన్‌నే ఇప్పుడు కూడా జీఎస్‌ఎల్‌వీలో వాడుతున్నారని ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌నాయర్‌ వెల్లడించారు. అంటే ప్రభుత్వంపై భారం పడకుండా ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత పొదుపుగా ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్నారో స్పష్టం అవుతుంది. ఇస్రో ప్రయోగాలకు అయ్యే ఖర్చుపై గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన యూఆర్‌ రావు కూడా వేరే సందర్భంలో పండుగలకూ, ఉత్సవాలకూ వేల కోట్లు ఖర్చు చేసే మన వాళ్ళు భారత్‌ కీర్తి చంద్రికలను నలుదిశలా వ్యాపింపజేసే ఇలాంటి ప్రయోగాలకు ఖర్చు చేయాల్సి వస్తే వెనకాడు తారని వ్యాఖ్యానించారు. రోదసి కార్యక్రమాలకు ఈ మధ్యనే మన దేశం ఎక్కువ ఖర్చు చేస్తోంది.

- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్టార్టప్‌లకు, అంతరిక్ష విజ్ఞాన పరిశోధనలకూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతె కాకుండా ఇస్రో శాస్త్రజ్ఞులు బేషజాలకూ, బడాయిలకూ పోకుండా అతి సాధారణ జీవితాన్ని గడుపుతారంటూ మాధవన్‌ నాయర్‌ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో చెప్పిన మాటల్లో అతిశయోక్తి లేదు.ప్రైవేటు సంస్థల ద్వారా వాహక నౌకలు, క్రయోజ నిక్‌ ఇంజన్ల తయారీని ఇస్రో ప్రోత్సహిస్తోంది.అంతరిక్ష విజ్ఞానంలో కొత్త శకానికి నాంది పలుకుతోంది.అంతరిక్ష రంగంలో మనదేశం ఇప్పటికే అగ్రదేశాలతో సమానంగా ప్రయో గాలను విజయవంతం చేస్తోంది. చంద్రయాన్‌-3 తో ఇస్రో ఘనకీర్తిని సాధించి పెట్టడంతో వాణిజ్యపరంగా మన దేశం నుంచి ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ముందుకు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement