Monday, June 24, 2024

నేటి రాశిఫ‌లలాలు(12-06-2024)

మేషరాశి : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటు-ం బ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

వృషభం: ఆర్థికంగా సామాన్యంగా ఉంటు-ంది. అనుకోని ఖర్చు లు కానీ.. ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టు-కోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరింటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మిథునం : ఆర్థికంగా అనుకూలంగా ఉంటు-ంది. అనుకోని విధంగా డబ్బు రావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది.
మీరు తలపెట్టిన పను లు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

కర్కాటకం : మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల ది నం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం : మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యా నానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

- Advertisement -

కన్య : మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి.

తుల : నూతన వ్యాపార ఒప్పందాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనటం కానీ, మరమ్మతు చేయించడం కానీ చేస్తారు. నూతన వస్త్రాలు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం : మీ వృత్తిలో అనుకోని మార్పు చోటు- చేసుకుంటు-ంది. మీరు ఎదురు చూస్తున్న పదోన్నతికానీ, పదవిలో మార్పుకానీ చోటు-చేసుకుంటు-ంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.

ధనుస్సు : మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. మీ సంతానం లేదా మీకు ఇష్టమైన వారి ఆరోగ్య పరిస్థితి మీ ఆందోళనకు కారణమవుతుంది. మీరు పూర్తి చేస్తానన్న పనులు పూర్తి చేయకపోవడం వల్ల మీ పై అధికారులు మీపై అసహనం వ్యక్తం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో అనుకోని మనస్పర్థలు ఏర్పడవచ్చు.

మకరం : చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం కారణంగా మానసిక అశాంతికి, ఆవేశానికి గురవుతారు. అనుకోని ఖర్చులు కానీ, నష్టాలు కానీ మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఎక్కువ ఆవేశానికి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించడం వల్ల సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం : మీ వృత్తిలో మార్పు కానీ, అనుకోని ప్రయాణం కానీ చోటు- చేసుకుంటు-ంది. ఇతరుల బాధ్యతలను, పనిని మీరు చేయవలసి రావచ్చు. మీ పట్టు-దలతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మెలిగేటప్పుడు జాగ్రత్త అవసరం. మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆర్థికంగా సామాన్యంగా
ఉంటు-ంది.

మీనం : మాట విషయంలో, ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. అనవసర వాదనల వల్ల మీ గౌరవానికి భంగం కలిగే ప్రమాదం ఉంటు-ంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే ప్రమాదముంటు-ంది. మానసికంగా స్థిరంగా ఉండటం, నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం వల్ల అన్ని విషయాల్లో ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement