Saturday, May 4, 2024

పరమాత్ముని చేరే పవిత్ర మార్గం..ఉత్తర ద్వారం!

లచక్రంలో ప్రతినెలలో ఒక పక్షములోని పదకొండవ తిథి ఏకాదశి. అనగా నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. శుక్ల పక్ష ఏకాదశి ఒకటి. రెండవది బహుళపక్ష ఏకాదశి. అనగా సంవత్సరమునకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. వీటిలో ప్రముఖమైనవి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి.
మార్గశిర ఏకాదశినే మోక్షద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు శ్రీమహావిష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ఈ రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవత లతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకుంటారు. అను గ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శ నం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతా యని భక్తుల విశ్వాసం.
ఈ రోజే క్షీరసాగర మధనం పిదప శ్రీమహావిష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు అమృతం పంచి పెట్టిన పవిత్రదినము.
ఇంద్రాది దేవతలు తమ శక్తులను కోల్పోయి దీనులైనారు. రాక్షసులు బలవంతులైనారు. దుర్వాస ముని శాప ఫలితంగా దేవత లందరు తమ అమరత్వాన్ని కోల్పోయినారు. అసురుల చేత బాధిం పబడినారు. రాక్షసుల బలం ముందు నిలువ లేకపోయినారు. రాక్షసులకు లొంగిపోయినారు. ఇట్టి దయనీయ పరిస్థితులలో దేవ తలందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, శరణు వేడినారు తమ కష్టాలను విన్నవించుకున్నారు. శ్రీమహావిష్ణు వు వారితో మీకు అమృతం ప్రాప్తించినచో శాశ్వతంగా అమరత్వము ను పొందగలరనీ, రాక్షసులకు అమృతం లభించని కారణంగా వారు మిమ్ములను జయించలేరని చెప్పాడు. పాల సంద్రమును, మందర పర్వతమును కవ్వముగా చేసుకొనండి. వాసుకిని త్రాడుగా తీసికొని దేవదానవులను మధించమన్నాడు. అలాగే ప్రారంభించారు. ఆవేళ జలప్రళయం సంభవించినది. దేవతలు భయపడినారు. అది గాంచి శ్రీమహావిష్ణువు కూర్మరూప ధారుడై తన వీపున నిలిపినాడు మంద ర పర్వతాన్ని, సముద్ర మధనం వేళ ముందుగా హాలాహలము ఉద్భవించినది. దేవదానవులు పరమశివుని ప్రార్థించారు. శివుడు ఆ విషమును తన గళమున నింపి జగద్రక్షణ గావించి గరళకంఠుడైనా డు. చివరగా అమృత కలశంతో ధన్వంతరి ప్రత్యక్షమై అమృత భాండమును అందించినాడు. దాని కొరకు దేవదానవుల మధ్య కలహం వచ్చింది.
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం దాల్చినా డు. దానవులు మోహినీ రూపమును గాంచి ఆకర్షితులైనారు. వివేక శూన్యులైనారు. అమృతమును మోహినీ రూపధారియైన విష్ణు మూర్తి దేవతలకు ప్రసాదించినాడు. దేవతలు అమరత్వమును పొం ది ఆనందించినారు. క్షీరసాగర మధనము ఒక ధ్యానమార్గ ము. దైవార్పిత భావముల సాధనకు ఫలితం అమృతత్వ ప్రాప్తి జరిగింది. ఈ ఏకాదశినాడు విష్ణు నివాసమైన వైకుంఠ ద్వారము తెరువబడు నన్న దృఢ నమ్మకముతో ఒక ప్రత్యేక ద్వారమును విష్ణువు ఆల యాలలో వేకువ ఝాముననే తెరుస్తారు. ఆ ప్రత్యేక వాకిలి ద్వారా భక్త జనము ప్రవేశించి విష్ణు దర్శనము చేసుకొని వైకుంఠ ప్రాప్తికి అర్హులమని భావించి ఆనందిస్తారు. ఈ ఏకాదశి రోజున భక్తులు అందరూ జపము- ధ్యానము- నామస్మరణ- ఉపవాసము- జాగర ణలు చేస్తారు. కుంఠము అనగా కుంటుపడుట- తగ్గిపోవుట- లోపిం చుట. వైకుంఠమనగా ఇవి లేని స్థితి. దైవత్వమును స్మరించుటయే వైకుంఠ ఏకాదశి యొక్క అంతరార్థము. తద్వారా ఆధ్యాత్మిక భావము పెంపొంది జన్మలు చరితార్థమవుతాయి. ఉత్తర ద్వార దర్శనము పరమ పవిత్రమై యుగయుగాలలో సంప్రదాయమై సంప్రదాయమై అలరారుచున్నది. నేడు జనులలో భక్తి భావన పెంపొంది, ప్రతి దేవా లయంలోనూ, ఉత్తర ద్వార దర్శనంలో ఆ దేవుని దర్శించి ధన్యులు అవుతున్నారు.
అనేకత్వముతో కూడియున్న ప్రకృతిలో ఏకత్వమును దర్శిం చుటయే ఈ ఉత్తర ద్వార దర్శనం ఒక క్రతువుగా సాగుచునేయున్న ది ఈ కలియుగంలో. మానవులందరూ అమృత స్వరూపులని వే దం తెల్పినది. పూర్ణ గుణములు వరించి పూర్ణత్వమును పొందు స్థితి యే వైకుంఠము. ఇదే ముక్కోటి ఏకాదశి దివ్య సందేశం.

ఏకాదశి ఉపవాస పరమార్థం

దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది. మన మనసులో నే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్ర హించి, పూజ-జపం- ధ్యానంలాంటి సాధనల ద్వారా ఆరాధించడ మని అర్థం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మన స్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి… జ్ఞానాన్ని, ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతా రు. ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశు ద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహ స్ర కమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మ రంధ్రం ద్వారా జీవా త్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే.
గీతా జయంతి

విశ్వమానవ విజ్ఞాన కోశం భగవద్గీత. దీనిని శ్రీకృష్ణ పరమా త్ముడు అర్జునుడికి బోధించింది ఏకాదశి నాడే. అందుకే వైకుంఠ ఏకా దశి రోజే గీతాజయంతి జరుపుకుంటారు. గీత బోధనలో భాగంగా మార్గశిర మాసం స్వయంగా తానే అన్నాడు. ఈ నెలలో చేసే ఏ పూజై నా, హోమమైనా, అభిషేకమైనా తానే స్వయంగా స్వీకరిస్తానని తెలియజేశాడు.
గీకారం త్యాగరూపం స్యాత్‌
తకారమ్‌ తత్వబోధకమ్‌
గీతా వాక్య మిదమ్‌ తత్వం
జ్ఞేయమ్‌ సర్వ ముముక్షుభి:
గీత అనే రెండక్షరములు సర్వసంగ పరిత్యాగానికి, ఆత్మసాక్షా త్కారానికి ప్రతీకలు. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుం ది. అలాంటి పరమ పావనమైన గీతను భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆ పవిత్ర గ్రం థాన్ని సృజించిన మహా పుణ్యం వస్తుందని హిందువుల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement