Friday, May 3, 2024

శ్రద్ధతో చేసే శ్రాద్ధం… మహాలయ పక్షం

వేదకాలం నాటి నుండి భాద్రపద కృష్ణ పక్ష ప్రతి పద నుండి అమావాస్య వరకు పితృపక్షంగా పిలువబడే పక్షం రోజులలో పితృకర్మలు ఆచరిం చడం తరతరాల వారసత్వంగా వస్తున్నది. దైవ గణాల కు సంబంధించి దక్షిణాయనం రాత్రి కాలం. దైవబలం తక్కువగా ఉన్న సమయాన, పితృగణాలు తిరిగి జన్మ ను పొందాలన్న కాంక్షతో, తమ శక్తులను ఏకీకృతం గావించి, కర్మాధికారం కలిగిన మానవుల వైపు చూస్తుం టాయి. మనుస్మృతి ప్రకారం ఆషాఢంలో కృష్ణ పక్షం నుండి ఐదు పక్షాలు అనగా భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు వంశీకుల నుండి అన్నాదులు కోరతారు. స్కంద పురాణంలోని నాగరఖండం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ప్రతి మానవుడూ తీర్చుకోవాల్సిన ఋణాలు మూడు ఉంటాయని పెద్దలు చెబుతారు. అవి దేవతల ఋణం, ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితరుల ఋణం. వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలం పితృపక్షం.
మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచు కుని పుత్రులు నిర్వహంచే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదా నాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిం చిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అం టారు. వీటినే పితృపక్షము అనీ అపర పక్షములనీ కూ డా అంటారు. ఈ ఏడాది మహాలయ పక్షాలు సెప్టెంబర్‌ 11 నుంచి ప్రారంభమయ్యాయి. 25వ తేదీ వరకు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృ శ్రాద్ధాలు నిర్వర్తించాలి.

మహాలయమంటే…

మహాన్‌ అలయ:, మహాన్‌లయ: మ#హల్‌ అలం యాతీతివా అనగా పితృ దేవతలకిది గొప్ప ఆలయ ము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొం దుట అని అర్థములు.
అమావాస్య అంతరార్థం ‘అమా’ అంటే ‘దానితో పాటు’, ‘వాస్య’ అంటే వసించడం. చంద్రుడు సూర్యుడి లో చేరి సూర్యుడితోపాటు కలిసి ఉండే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. మరణించిన మన పితృదేవత లకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ:
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ:కర్మ సముద్భవ:
అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే… అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించా లంటే… దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించా లంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞా ల ద్వారా వారివారి హవిర్భాగాలు అందజేయాలి.
మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకం లో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహం లో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భ కోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.
మరణించిన మన పితరులకు మోక్షం కలగా లంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే… పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది.
కుటుంబాలలో మరణించిన వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడానికి ఈ మహాలయ పక్షాలు నిర్దేశించ బడ్డాయి. పితృ తిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్ర మే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు, పదిహను రోజులు వంశం లో మరణించిన వారందరికీ మాత్రమేకాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహతులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది.
సూర్యుడు కన్యలో ప్రవేశించింది మొదలుగా ఉన్న దినాలలో పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధ గా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహంచాలి.
1. పితృదేవతలకు అధిపతి శ్రీమహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.
2. ఇదిు విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.
3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
4. ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
5. ఇది సర్వ కారుణ్య స్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహతుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త.
మీ పురోహతుని సూచనానుసారం ఈ పితృ కార్యాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహంచాలి.
హమాద్రి పండిత విరచితమైన చతు స్వర్గ చింతా మణి ఆధారంగా సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే పదహారు పగటి కాలాలు పితృ యజ్ఞం చేయాలి. తద్వారా గయా శ్రాద్ధం చేసిన ఫలితం దక్కుతుంది. పితృపక్షాలు ప్రతిరోజు శ్రాద్ధం చేయాలని కాలా మృత కారుడు నిర్ణయించాడు. వీలుకాకుంటే ఒక్క రోజైనా మహాలయ పక్షం విధి చేయాలి.
”శ్రద్ధయా దీయతే శ్రాద్ధం”
అంటే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. మహాలయ విధి నాలుగు రకాలు. భౌతిక శరీరం మొదటిది. కనిపించేది రెండవది ప్రేత శరీరం. మూడవది ఆత్మ సూక్ష్మ శరీరం. ఈ మూడింటి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ మూడు రూపాలలో పితరులకు, అగ్ని ముఖం, బ్రాహ్మణ భోజ నం, ఉపవాసం నాలుగు పద్ధతులలో శ్రాద్ధం ఆచరణీ యం. పితృపక్షాల చివరి రోజైన భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య అని అంటారు.
సంప్రదాయా చరణ పరుని జీవిత కాలంలో మహాలయ పక్షంలో నదీ తీరాలలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా భావి స్తారు. ఈ క్రమంలో వారివారి పితరులు మృతి చెందిన తిథుల ప్రకారం భాద్రపద కృష్ణ పక్షంలో అదే తిథులతో పౌరోహతుల ద్వారా శ్రాద్ధ కర్మలను ఆచరించి, పిండ ప్రదానాలు చేయడం సంప్ర దాయం. ఆలా చేయలేని వారు తిలాంజలితో పితృ తర్ప ణాలనైనా వదులుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement