Friday, May 17, 2024

నేటి రాశిఫ‌లాలు(04-07-2022)

మేషం: రుణబాధలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసమస్యలు వేధిస్తాయి. పనులలో ఆటంకాలు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్నిబాధ్యతలు

వృషభం: చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలరీత్యా ఖర్చులు. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలలో ఆటంకాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

కర్కాటకం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

సింహం: ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

- Advertisement -

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని అనుకూల మార్పులు.

తుల: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

వృశ్చికం: స్వీయనిర్ణయాలు తగదు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు.

మకరం: మ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిత్రమైన సంఘటనలు. ధనలాభాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు.

కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటు-ంబసమస్యలు. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement