Friday, May 3, 2024

వైభవంగా యాగాలు

ఒకవైపు శ్రీమన్నారాయణ క్రతువు.. మరోవైపు వైభవేష్ఠి.. పరమేష్ఠి
చినజీయర్‌ పర్యవేక్షణలో శ్రీరామ అష్టోత్తర పూజ
నిర్విఘ్నంగా రామానుజుల సహస్రాబ్ది

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా ముచ్చింత ల్‌లో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఐదవ రోజు ఆదివారంనాడు ఘనంగా జరిగాయి. ఈ రోజు కార్య క్రమంలో భాగంగా తొలుత పరమేష్ఠి యాగాన్ని నిర్వహించారు. తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ యాగాన్ని నిర్వహిస్తారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి అన్నారు. ఐదు వేల మంది రుత్వికులు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని నిర్వహించారు. పితృదేవతల తృప్తి కోసం, పితృ దోష నివారణ కోసం వైభవేష్టి హూమాలను నిర్వహించారు. నాలుగు వేదాలలోని మంత్రాలను పఠిస్తూ 114 యాగశా లలో 1035 హోమ హోమ గుండాల్లో ఏకధాటిగా లక్ష్మీ నారాయణ మహా క్రతువు ఘనంగా జరుగుతోంది. అనం తరం ప్రవచనం మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామ పూజ శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్ష ణలో భక్తులు ఆచరించారు. ఈ పూజ ఫలితాన్ని శ్రీ దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి వారు భక్తులకు వివరించారు. అనంతరం సింహాచలం పండితులు టివి రాఘవాచార్యులు భగవద్రామానుజుల వైభవాన్ని తెలియజేశారు. రాజస్థా న్‌లోని పుష్కర నుంచి విచ్చేసిన జగద్గురు రామచంద్ర ఆచార్య హిందీలో అందించారు. అనంతరం టెకెవీ రాఘవన్‌ అందించిన స్ఫూర్తి ప్రవచనం అందరినీ ఎంత గానో ఆకట్టుకుంది. సమకాలీన అంశాలను స్పృశిస్తూ రామానుజ స్ఫూర్తి అందించారు. ప్రముఖ తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రామనుజాచార్య విశిష్టతలపై పాటల రూపంలో తెలియచేసారు. ఆ తర్వాత ప్రవచన మండపంలో గాయత్రీరావు అందించిన సంగీత కార్యక్రమాలు దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. గొల్ల శ్రీనివాస్‌ బృందం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను కట్టిపడేసింది. పెదప్రోలు భావన బృందం వారి కూచిపూడి నృత్యం అందరినీ విశేషంగా అలరించింది. శ్రీకృష్ణుడిగా జాబిలి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ప్రజ్ఞ విద్యార్థులతో నిర్వహించిన అవధాన కార్యక్రమం ఆకట్టుకుంది. శ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారి సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగడం విశేషం. అమెరికన్‌ విద్యార్ధులు తమ విశేష ప్రతిభను కనబరిచారు. ప్రజ్ఞ అమెరికా సెక్రటరీ రాజేష్‌ వారి బృందం ఈ విశేష కార్య క్రమాన్ని నిర్వహించింది. సాయంత్రం ప్రవచన మండపం లో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారి సమక్షంలో జరిగింది. అనంతరం శ్రీనివాస్‌ వీణపై రోణు మజుందార్‌ వేణువుపై నిర్వహించిన జుగల్బందీ వీణ వేణు వినోద కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. చివరగా సము ద్రాల మాధవి బృందంచే సాంస్కృతిక కార్య క్రమాలు ఘనంగా జరిగాయి. మరో వైపు సమతా మూర్తి ప్రాంగణంలోని 216 అడు గుల భగవద్రామానుజుల విగ్రహాన్ని చూడడా నికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. మరో వైపు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు జస్టిస్‌ పోనగంటి నవీన్‌ రావు, జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి , సమతమూర్తిని దర్శించుకుని శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారి మంగళ శాసనాలు అందుకున్నారు.

నేటి కార్యక్రమాలు
దృష్టి దోష నివారణకు వైయ్యూహికేష్టి యాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించనున్నారు. వీటితో పాటు ప్రముఖులచే ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

రోజూ.. ఇలా యాగ నిర్వహణ
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు నిర్విఘ్నంగా, వైభ వోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడు కల్లో రోజుకో యాగం లోక కల్యాణం కోసం , వివిధ లక్ష్య సిద్ది కోసం నిత్య మంత్ర పఠ నంతో నిర్విరామంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కనీ విని ఎరుగని మహా యజ్ఞమైన శ్రీ లక్ష్మీ నారాయణ సహస్ర కుం డ మహా యజ్ఞంలో లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు.

ఘట్టాలు
మంత్ర జపం, ఆహుతి, తర్పణం
పుష్పార్చన, తదీయారాధన (భోజనం )

- Advertisement -

మంత్ర జపం…
శ్రీ లక్ష్మీ నారాయణ సహస్ర కుండా మహా యజ్ఞంలో ప్రతి రోజు ఒక కోటి అష్టా క్షరీ మహా మంత్ర జపం 6:00 నుంచి 7 :30 వరకు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వా మి వారితో మంత్ర అనుష్టానం నిర్వహి స్తు న్నారు. ఇది ఒక అద్భుతమైన అనుభ వం గా పేర్కొంటున్నారు. పవిత్రమైన యా గ శాలలో, అతి శక్తివంతమైన అష్టాక్షరీ మం త్రాన్ని నిశ్శబ్దంగా మనసులో స్మరి స్తూ, భక్తులు శారీరకంగా, మానసికంగా తమని తాము దృఢపరుచుకుంటున్నారు.

ఆహుతి…
అందులో పదవ వంతు, అంటే 10 లక్ష ల ద్రవ్యాలను ఋత్వికులు 1035 కుం డాల్లో ఆహుతి చేస్తారు.
తర్పణం… అందులో పదవ వంతు అంటే ఒక లక్ష తర్పణాలు చేస్తారు.
పుష్పార్చన… అందులో పదవ వంతు అంటే 10 వేల నామాలతో పుష్పార్చన చేస్తారు. ప్రతి రోజు
ఉదయం 9:30 గంటలకు ప్రవచన మండపంలో అనే క అవతారాలలో దర్శన మిచ్చే భగవంతునికి అష్టోత్థ రశత నామ పూజ, పుష్పా లతో జరుపుతారు.
తదీయారాధన… అందులో పదవ వంతు అంటే వేయి మందికి తదీ యారాధన అంటే ప్రసాద వితరణ చేయాలి. ఇక్కడ తదీయారాధ నలో ప్రతి రోజు లక్షలాది మందికి భోజన సౌలభ్యం కల్పిస్తున్నారు.

108 దివ్యక్షేత్రాల్లో అధివాస హోమాలు
సమతామూర్తి ప్రాంగణంలోని 108 దివ్యక్షేత్రాలలోను మూర్తులకు రేపు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 6.00వరకు అధివాస హోమం నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండాలలో ప్రత్యేకంగా తత్వన్యాస హోమం చేశారు. అలాగే వివిధ ధాన్యాలు, పండ్లతో ధాన్యాధివాస హోమాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement