Friday, June 14, 2024

దైవఋణం తీర్చేది నిత్యానుష్టానం!

మనం ప్రతీరోజూ దేవునికి పూజా కార్యక్రమాలు నిర్వ#హస్తూంటాము. ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో నిత్యపూజకు కాని, ఆధ్యాత్మిక చింతనకు కాని తగి నంత సమయం లేదనే చెప్పాలి. మానవ జన్మ ఎత్తగానే మూడు ఋణాలు ఉంటా యని పురాణాలు, పెద్దలు చెబుతారు. అవే పితృ ఋణం, దైవ ఋణం, ఋషి ఋణం. ఇం కా గృహస్థాశ్రమంలో అతిథి ఋణం వంటివి కూడా ఉంటాయి.
ముఖ్యంగా పైన చెప్పిన మూడు ఋణాలు మనం తీర్చుకోవాలి. దైవ ఋణంలో భాగంగా నిత్యానుష్టానం (పూజ) చేయాలి. భగవంతుని ఆరాధించాలి. ఈ ఆచరణలో కొన్ని పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఇమిడి ఉన్నాయి.

ఎందుకు నిత్యానుష్టానం చేయాలి?

ఎందుకంటే భగవంతుని పట్ల అంకితభావం కలిగి ఉండుటకు. నిత్య జీవితంలో ఎదు రయ్యే సమస్యల బారి నుండి రక్షించే నాథుడు భగవంతుడే కదా! అందుకే ఆయనతో అను బంధం ఏర్పడుటకు, మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి నిత్యపూజలు, పండుగలలో చేసే ఆరాధనలు ఉపయుక్తంగా ఉంటాయి. ఎవరు నిత్యం పూజ చేస్తారో మన సు ఏకాగ్రత పొంది, నెమ్మది నెమ్మదిగా బుద్ధిలో గల భ్రాంతి, జడత్వము, వివేక #హనత, అ#హంకారం సంకోచం, నశించిపోతాయి. శత్రు భయం ఉండదు. దీర్ఘాయువు లభిస్తుంది. పాప భయంపోతుంది.

నిత్యానుష్టానంలో గృ#హణి బాధ్యత

సాధారణంగా గృ#హ యజమానే ఈ నిత్యపూజలు చేయడం ధర్మమని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ కుదరకపోతే యజమాని భార్య చేయాలి. మానకూడదు. బ్రహ్మ ముహూర్తములోనే లేచి, దైనందిన కార్యక్రమాలను ప్రారంభించాలి.
”బ్రా#హ్మ ము#హూర్తే యా నిద్ర సా పుణ్యక్షయ కారిణీ తాం!
కరోతి ద్విజో మోహాత్‌ పాద కృచ్చేణ శుద్ద్వతి!”
స్మృతి రత్నాకరంలో చెప్పబడింది బ్రహ్మ ముహూర్తంలో ఇంకా నిద్రించేవారు పాప ము నుండి విముక్తి పొందుటకు ”పాద కృచ్చము” అనే వ్రతాన్ని చేయవలసి ఉంటుంది అని. అయితే ఈ విషయం రోగ గ్రస్థులకు, వయో వృద్ధులకు వర్తించదు. శుచిగా, శుభ్రమైన వస్త్ర ధారణతో ఉండి ముందు రోజు చేసిన పూజాద్రవ్యాలు (నిర్మాల్యాలు) తొలగించి, గంగాజ లంతో ఒకసారి సంప్రోక్షణ చేసి, యజమాని పూజ చేయుటకు అవసరమైన ద్రవ్యాలు అంటే పుష్పాలు, అగరవత్తులు, అక్షింతలు, మొదలగు నవి సిద్ధపరిచి, ఆయన పూజ పూర్తి అయ్యే లోగా నైవేద్యం సిద్ధపరచాలి.
పూజా విధానము: దేవుని మందిరం ముందు కూర్చునే ముందు శుచిగా, శుభ్రమైన వస్త్రంతో, నుదుటన బొట్టు కాని విభూతి ధారణతో కాని ఉండాలి. మనలోని అజ్ఞానాన్ని తొల గించుకోవడానికి, అంతేకాకుండా,ఆ ప్రదేశంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. దాని ప్రభావం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి, మంచి ఆలోచనలు వస్తాయి.
”అప సర్వంత్వితి మంత్రస్య వామదేవ ఋషి:
శివో దేవతా! అనుష్టప్‌ ఛంద:! భూతాది విఘ్నో త్సాదనే వినియోగహ:!!”
అని పఠించి, భూతములను వెడలి కొడుతున్నట్లుగా మూడుసార్లు చప్పట్లు కొట్టాలి. లేదా గంటా నాదం చేయాలి. ముందుగానే సంధ్యావందనం చేసి, తదుపరి పూజా కార్యక్ర మాలు పూర్తి చేయాలి. పూజలో ఆచమనం, సంకల్పం, భూచ్చోటన, గణపతి ఆరాధన, తరు వాత ఇష్ట దైవాన్ని భక్తిగా ఆరాధించాలి. షోడశోపచారాలతో పూజ సమాప్తం అవుతుంది. నైవేద్యం, మంగళహారతి మంత్రపుష్పంతో నిత్యానుష్టానం పూర్తి అయినట్లే!

- Advertisement -

ఏఏ పూజా ద్రవ్యాలు ఏఏ స్థానంలో ఉంచాలి?

పూజా సామాగ్రి అర్చకునుకి ఎలా ఉండాలో శాస్త్రాలు వివరించాయి. ఎడమ వైపు సువాసనా భరితమైన జలం ఉన్న పాత్ర, కలశ పాత్ర ఘంట, ధూపం ఇచ్చేది, తైల దీపం ఉం డాలి. నిత్య పూజలో రెండు దీపాలు వెలిగిస్తారు. ఒకటి నువ్వుల నూనెతో, రెండవది ఆవు నేతితో. ఆవు నేతితో వెలిగించిన దీపం కుడివైపు ఉండాలి. ఎదురుగా పూలు, గంధం, మిగిలి నవి ఉంచాలి.

ఎటువంటి పుష్పాలు వాడాలి?

దేవునికి సమర్పించే పూలు వాసన చూడకూడదు. రెక్కలు ఊడుతున్న పుష్పాలు పనిచేయవు. తోట మాలి ఇంట్లో కాని, పూల దుకాణంలో కాని నిల్వ ఉన్న పూలకు పాచి దోషం లేదు గణపతికి తులసి ఒకటి తప్ప మిగిలినవన్నీ పూజచేయవచ్చు. శివునికి మొగలి, పొగడ, వెలగ, ముళ్ళున్న పుష్పాలు నిషిద్ధం. విష్ణువుకు మల్లెలు, సన్నజాజి, సంపెంగ, తు లసీ దళాలు అత్యంత ప్రీతి. నిషిద్ధం మైనవి తప్ప మిగిలిన వాటితో చేయవచ్చును. గణషునికి తెల్ల జిల్లేడు, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి తామరపువ్వులు శ్రేష్ఠం. శ్రీ కృష్ణ పరమాత్మ భగవ ద్గీతలో- —”పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి!
తర#హం భక్త్యు ప హృతమ్‌ అశ్నామి ప్రయతాత్మన:!!”
నాకు ఎవరైనా భక్తితో ఆకుగాని, పువ్వుగాని, పండుగాని, ఆఖరికి నీరు గాని సమర్పిస్తే, ఆ స్వచ్చమైన మనసు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని సంతోషంగా స్వీకరిస్తాను. అన్నాడు. శ్రీకృష్ణుడు రాయబార సమయంలో తన భక్తుడైన విదురుడు ఇంటికి భోజనానికి వెళ్ళిన సందర్భంలో విదురుడు సంతోషంతో, మైమరచి, అరటి పండు ఒలిచి తొక్క భగవం తునికి సమర్పించి, గుజ్జు విసర్జించాడు.
శ్రీరాముడుకి భక్తితో శబరి బదరీ ఫలాలు సమర్పించలేదా! పండుగలు, ప్రత్యేక రోజు ల్లో అనుసరించవలిసిన విధానం కూడా ఉంది. దసరా పండుగలలో అమ్మవారిని నెలకొల్పి పూజిస్తారు. దీపావళి, వరలక్ష్మీ వ్రతం వంటి పండుగ రోజుల్లో ఆయా విధానాన్ని బట్టి, నిరా హారంగా ఉండే వ్రతవిధానం, పూజ పూర్తిచేయాలి.

దేవాలయ సందర్శన

పర్వదినాల్లో, లేదా దేవాలయ కార్యక్రమాలలో కాని పాల్గొనడం కూడా భగవతారా ధనే. భక్తితో అంటే త్రికరణ శుద్ధితో మనం ఈ పూజ కార్యక్రమాలునిత్యం చేసి, దైవ ఋణం తీర్చుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement