Sunday, May 19, 2024

అర్థం-పరమార్థం

రెండు పదాలకు మధ్య ఒక అక్షరం తేడా వుంటే చాలు భావం మారిపోతుంది. సంబంధా లను, భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది. పూ ర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునే వారు. భారవి తండ్రితో ‘నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా!’ అనేవారు.
ఆయన ‘వాడింకా చిన్నవాడు నేర్చుకోవల సింది చాలావుంది. ఏదో వ్రాస్తాడులే!’ అనేవా డు. భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి. తల్లి దగ్గర ‘నాన్నగారు తీసిపారేసినట్టు మాట్లాడతారు.’ అనేవాడు.
చివరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది. ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒ కరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తు న్నాడు భార్య వడ్డిస్తూ వుంది. భారవి, అన్నం తిన్నాక పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెర ట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.
అప్పుడు భారవి తల్లి భర్తతో ‘మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడు తారు?వాడు చాలాబాధపడుతున్నాడు!’ అంది.
అప్పుడు తండ్రి నవ్వి…. ‘పిచ్చిదానా! నా కు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకు న్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయు:క్షీణం అంటారు. అంతేకాకుండా పొగడ్త మనిషిని పా డు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుం ది. ఇంకా యెంతో పైకి రావలసిన వాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దాని తో వాడి అభివృద్ధి ఆగిపోదా?’ అన్నాడు.
అది విన్న భారవి పశ్చాత్తాపంతో రగిలిపో యాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాల మీద పడి భోరున ఏడ్చాడు. తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి ‘నాకేదయినా శిక్షవేయమ’ని బ్రతిమాలాడు.
‘పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది! శిక్ష ఎందుకు?’ అని తండ్రి చెప్తున్నా వినకుండా తన కు ‘శిక్ష వేయమ’ని పట్టుబట్టాడు. తండ్రి ‘సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా!’ అన్నాడు. ‘ఇంత చిన్న శిక్షనా?’ అన్నాడు భారవి. తండ్రి నవ్వి ‘అది చాల్లే వెళ్ళు!’ అన్నాడు.
భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్ప టికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు. సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడు వచ్చాడని చాలా మర్యాద చేశారు. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు. పనులు చెప్పడం ప్రారం భించారు. మర్యాదలు తగ్గాయి. అందరూ విసు క్కుంటూ మాట్లాడేవారు. దేనికీ బదులు చెప్ప కుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.
అతని భార్యను కూడా పొలం పనులకు పం పేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ ‘ మీ ఊరు వెళ్లిపోండ’ని చెప్పింది. భారవి సమాధానం చెప్పకుండా మౌనం వ#హం చేవాడు. ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి ‘యింక నేను మావూరికి వెళతాను’ అని బయల్దేరాడు.ఇంత #హఠాత్తుగా ఎందుకు వెళ్లా లని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. భార్య కు, అత్తామామలకూ విషయం వివరించి ‘నా శిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను!’ అని చెప్పాడు. భారవి తన తండ్రి వేసిన శిక్ష తన లో ఎంతో ఓర్పు, నేర్పు, స#హనాన్ని, అవగా#హన పెంచాయని గ్ర#హంచాడు. తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! అభివృద్ధిని కోరుకు నే వారిలో ఆయనే ప్రథముడు. కోపంగా మాట్లా డే ప్రతివారిని శతృత్వముతో చూడరాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement