Thursday, April 25, 2024

జన్మాష్టమి – శ్రీకృష్ణ జయంతి

శ్రీకృష్ణుడు శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్ట మినాడు నిశీథ (అర్ధరాత్రి) కాలంలో జన్మించాడు.
మన దేశంలో పూర్వపద్ధతి, దృక్సిద్ధం అని రెం డురకాల పంచాంగాలున్నాయి. గణక గ్రంథాల ద్వారా గణించి రచించేవి పూర్వపద్ధతి పంచాంగా లు. దృక్సిద్ధం అంటే చూపుచే సిద్ధించినది. ఇపుడు వేధశాలల ద్వారా కనబడిన గ్రహస్థితి ఆధారంగా రచించేవి దృక్సిద్ధ పంచాంగాలు. పూర్వపద్ధతి పంచాంగాల ప్రకారం శుక్రవారం నిశీథ కాలంలో పూర్తిగా అష్టమి ఉంది. కాబట్టి వాటి ప్రకారం నేడు జన్మాష్టమి. దృక్సిద్ధపంచాంగాల ప్రకా రం గురువారం రాత్రి 9.25 తరువాత అష్టమి వచ్చింది. శుక్రవారం నిశీధ కాలంలో అష్టమి లేదు కాబ ట్టి దృక్సిద్ధ పంచాంగాలననుస రించి గురువారమే శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. 20 వ తేదీన రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు శ్రీకృష్ణ జయంతీవ్రతం చేస్తారు. స్మార్తులు అంటే శివకేశవులనిద్దరినీ పూజించేవారు, మాధ్వులు శ్రీకృ ష్ణ జన్మాష్టమీ వ్రతం, శ్రీ వైష్ణవులు శ్రీకృష్ణ జయం తీ వ్రతం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement