Friday, May 17, 2024

గీతాసారం (ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 12

మోఘాశా మొఘకర్మాణో
మోఘజ్ఞానా విచేతస: |
రాక్షసీమాసురీం చైవ
ప్రకృతం మోహినీం శ్రితా: ||

తాత్పర్యము : ఆ విధముగా మోహపరవశులైనవారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారికి ముక్తికి సంబంధించిన ఆశలు, కార్మకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.

భాష్యము : చాలా మంది తమను తాము భక్తులమని ప్రకటించుకొందురు. కాని వారి హృదయములో శ్రీ కృష్ణుడు దేవాది దేవుడు, పరమ సత్యము అనే భావన ఉండదు. అలాంటి భక్తులూ, కామ్యకర్మలు చేసేవారూ, ముక్తిని పొందాలనుకునేవారు కృష్ణుని పట్ల సరైన అవగాహన లేకపోవుడ వలన వారు తమ లక్ష్య సాధనలో సఫలీకృతులు కాలేరు. శ్రీ కృష్ణున్ని ఒక సామాన్య మానవుడని భావించుట అపరాధమే కాగలదు. కేవలము అసూయ వలన మాత్రమే, జీవుడు దేవాది దేవునితో సమానుడని భ్రాంతి చెందు చుండును. అటువంటి వ్యక్తులు దానవ, నాస్తిక జాతులలో జన్మించి పాతాళ లోకాలకు వెళ్ళెదరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement