Friday, May 17, 2024

గీతాసారం (ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 11

11.
అవజానంతి మాం మూఢా
మానుషీం తనుమాశ్రితమ్‌ |
పరం భావమజానంతో
మమ భూతమహేశ్వరమ్‌ ||

తాత్పర్యము : నేను మానవ రూపమున అవతరించినపుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారు ఎరుగరు.

భాష్యము : శ్రీ కృష్టుడు ఒక సామాన్య మానవుడు లేదా మహోన్నత పురుషుడు అనే దురవగాహన నేటి సమాజములో నాటుకు పోయి ఉన్నది. కానీ కృష్టుడు అట్లు తప్పు ద్రోవ పట్టిన వారిని మూర్ఖులని సంభోదిస్తూ ఉన్నాడు. సృష్టి స్థితి లయలను ఇచ్ఛానుసారము చేయు ఆ దేవ దేవుడ్ని, సామాన్య మానవునితో ఎట్లు పోల్చగలము! మరి అతడు చేసిన మానవాతీత కార్యములను ఎట్లు సామాన్యమని భావింపగలము. ఇక్కడ ‘మానుషీం’ అను పదము శ్రీ కృష్ణుడు మానవుడి రూపాన్ని స్వీకరించినాడని, ఒక మానవుని వలే జీవిం చినాడని తెలియజేస్తుంది. అయితే మాయావాదులు ఈ పదానికి వక్ర భాష్యము చె ప్పుదురు. శ్రీ కృష్ణుడు శరీరము మనవలే భౌతికమైనదని తప్పుద్రోవ పట్టించుదురు. కాని భక్తులు వారి మాటలకు మోసపోక శ్రీ కృష్ణుడే దేవాది దేవుడని సర్వత్రా విస్తరించినప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడని గ్రహించి, ఆయనను మాత్రమే శరణు జొచ్చుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement