Friday, May 17, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 3

3.
అశ్రద్దధానా పురుషా:
ధర్మస్యాస్య పరంతప ||
అప్రాప్య మాం నివర్తంతే
మృత్యుసంసారవర్త్మని ||

తాత్పర్యము : ఓ శత్రుంజయుడా! ఈ భగవత్సేవ యందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగము నందలి జనన, మరణ మార్గమునకే తిరివత్తురు.

భాష్యము : కృష్ణ చైతన్య సాధనలో అత్యంత కీలకమైనది శ్రద్ధ లేదా విశ్వాసము. అనగా శ్రీకృష్ణున్ని సేవించినచో దేవతలను, అందరి జీవరాశులను సంతృప్తి పరచినట్లే అనే విశ్వాశమును కలిగి ఉండుట. నిజానికి కృష్నచైతన్య మార్గములో పురోగతి అంటే క్రమేణ అటువంటి విశ్వాసమును పెంపొందిచుకొనుటయే. శ్రద్ధననుసరించి భక్తులను మూడు తరగతుల వారిగా విభజించవచ్చును. ఉత్తమ భక్తుడు: శాస్త్రములలో నిపుణుడై అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. మధ్యమ భక్తుడు : దృఢమైన శ్రద్ధను కలిగి ఉన్నప ్పటికీ శాస్త్ర అవగాహనలో అంతగా పరిణితి చెంది ఉండడు. కనిష్ఠ భక్తుడు : దృఢమైన శ్రద్ధ, శాస్త్ర అవగాహన లోపించినపపటికీ, మంచి సాంగత్యములో, సరళ హృదయముతో కృష్ణ చైతన్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకు తెలుసుకొనవలసిన విషయమేమంటే, శ్రద్ధ లేకుండా భగవద్భక్తిని కొనసాగించుట సాధ్యము కాదు. కాట్టి కనిష్ట భక్తుడు మొంచి సాంగత్యములో సాధువుల నుండి శ్రవణము చేసి శ్రద్ధను పెంపొందించుకొనకపోతే మార్గము నుండి వైదొలగి పోవుట తథ్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement