Friday, May 17, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 28

28.
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్‌ |
అత్యేతి తత ్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్‌ ||

తాత్పర్యము : వేదాధ్యయనము వలన, తీ వ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్త్విక కర్మలను మరియు కామ్యకర్మలను ఒనరించుట వలన కలుగు ఫలితములు భక్తిమార్గమును చేపట్టు మనుజునికి లభిం పకుపోవు. కేవలము భక్తియుతసేవ నొనరించుట ద్వారా అతడు వీటన్నిం టిని పొందుటయే గాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.

భాష్యము : ఈ శ్లోకము భగవద్భక్తిని వివరిస్తున్న ఏడవ, ఎనిమిదవ అధ్యాయపు సారము. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఐదేళ్ళ నుండి ఇరువది ఏళ్ల వరకూ గురుకులములో గురువును సేవిస్తూ బ్రహ్మచారి వేదాలను నేర్చుకుంటాడు. ఆ తరువాత గృహస్థగా దానాలను యజ్ఞాలను తగు రీతిలో నిర్వహిస్తాడు. తరువాత వానప్రస్థాశ్రమములో అనేక తపస్సులను ఆచరిస్తాడు. ఈ విధమైన నియమబద్ధ జీవితాన్ని గడిపితే చివరకు స్వర్గాన్ని చేరుకునే అవకాశము ఉంటుంది. అటు పిమ్మట ఇంకా పురోగమించి ముక్తిని పొందే అవకాశము ఉంటుంది. చిట్ట చివరకు నిరాకార బ్రహ్మజ్యోతిని గాని భగవద్ధామాన్ని గానీ చేరుకోవచ్చు. ఇదే వేదాలను తు చ తప్పకుండా పాటిస్తే వచ్చే ఫలితము. అయితే వీట న్నింటినీ భక్తి యోగము ద్వారా ప్రత్యక్షముగా శ్రీకృష్ణున్ని సేవించటము ద్వారా సులభముగా సాధించవచ్చును. ఈ మార్గాన్నే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునున్ని పాటించమని ప్రోత్సాహిస్తూ ఉన్నాడు. నేడు ఈ పద్ధతిని భక్తుల సాంగత్యములో శ్రవణము చేయడము ద్వారా, మనము కూడా అదే ఫలితాన్ని పొందే అవకాశాన్ని కలిగి ఉన్నాము.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
అక్షరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ: ||

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement