Wednesday, April 24, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 2

2.
అధియజ్ఞ: కథం కోత్ర
దేహేస్మిన్‌ మధుసూదన
ప్రయాణకాలే చ కథం
జ్ఞేయోసి నియతాత్మభి: ||

తాత్పర్యము : ఓ మధుసూదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగము నందు నిలిచినవారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగగలరు?

భాష్యము : అర్జునుడు తన మనస్సులోని సంశయములను రాక్షసులతో పోల్చి, రాక్షసులను సంహరించుటలో దిట్టయైన శ్రీ కృష్ణున్ని, తన సంశయములను కూడా అదేవిధముగా పారద్రోలమని ఇక్కడ ‘మధుసూదనా’ అని సంభోదించుచున్నాడు. యజ్ఞపతి ఎవరు? అతడు జీవుని శరీరములో ఏవిధ ముగా జీవించుచున్నాడు? అంతేకాక మరణ సమయములో భక్తుడు కృష్ణునిపై మనస్సును ఎలా లగ్నము చేయగలడు. కులశేఖర మహారాజు భగవంతుణ్ని ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ”దేవా! ప్రస్తుతము నా ఆరోగ్యము బాగుగా నున్నది. కాబట్టి ఇప్పుడే నేను మర ణించిన నా మనస్సు నీ యందు లగ్నమయ్యే అవకాశము ఉన్నది. అదే నేను సహజ మృత్యువుకు ఎదురు చూసినట్లయితే శరీర అవయవాలు క్షీణించి, గొంతు మూగబోయి, మనస్సు కలత చెందు సమయములో నిన్ను స్మరించే అవకాశము ఉండకపోవచ్చునేమో కదా! కాబట్టి నన్ను ఇప్పుడే మరణింపనివ్వు”

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement