Monday, June 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 10

10.
అభ్యసేప్యసమర్థోసి
మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి
కుర్వన్‌ సిద్ధిమవాప్స్యసి ||

తాత్పర్యము : భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని పొందగలవు.

భాష్యము : ఎవరైనా గురువు మార్గదర్శకత్వములో భక్తియోగ నియమాలను నిష్టతో పాటించలేనప్పుడు భగవంతుని కోసము కొన్ని కార్యాలను చేయుట దవ్‌రా కూడా భగవంతునికి దగ్గర కావచ్చునను. ఇంతకు ముందు అధ్యాయము ఆఖరి శ్లోకమబులో తెలియజేసినట్లు, ఏ కర్మలను చేసినా వాటిని, వాటి ఫలితాలను, కనీసము కొంతశాతమునైనా భగవంతునికి అర్పించవచ్చును. భక్తులు ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నులై ఉందురు. అటువంటి వారికి సహాయము చేయవచ్చును. ధనము, స్థలము, సామాగ్రి, ఇలా ఏదో ఒక రూపేణ భక్తులకు తోడ్పడవచ్చును. ఇలా ఎవరైతే తమంతట తాము ముందుకు వచ్చి తగిన సహాయము చేస్తారో, వారిలో భగవంతుని పట్ల కొంత ప్రేమ పెంపొంది, తద్వారా పూర్ణత్వ స్థితికి ఎదుగుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement