Saturday, September 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 53
53
నాహం వేదైర్న తపసా
న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం
దృష్టవానసి మాం యథా ||

తాత్పర్యము : దివ్యచక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్ర తపస్సులచే గాని, దానముచే గాని, పూజలచేగాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్ధముగా గాంచుటకు ఇవన్నీ సాధనములు కాజాలవు.

భాష్యము : శ్రీకృష్ణుడు మొట్టమొదట చతుర్భుజ రూపములో దేవకీ వసుదేవులకు దర్శన మిచ్చిన పిమ్మట ద్విభుజరూపమునకు మారెను. ఈ రహస్యమును నాస్తికులు, భక్తి హీనులు అర్థము చేసుకొనలేరు. వేదాలను సంస్కృత పాండిత్యముతోనో, లేదా విద్యార్హతలతోనో అధ్యయనము చేసే వారికి కృష్ణుడు అర్థము కాడు. అలాగే దేవాలయాలకు వెళ్ళి మొక్కుబడిగా పూజలు చేసేవారికి కూడా కృష్ణుడు అర్థం కాడు. రాబోవు శ్లోకములో స్వయముగా కృష్ణుడే వివరించినట్లు కేవలము భగవద్భక్తి ద్వారా మాత్రమే కృష్ణున్ని అర్థము చేసుకొనగలము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement