Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 47
47.
శ్రీభగవాన్‌ ఉవాచ
యమా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్‌ |
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్‌ ||

తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడనైన నేను నా అంతరంగశక్తిచే భౌతిక జగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమగును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచి యుండలేదు.

భాష్యము : తన స్నేహితుడైన అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు తేజోమయమైన తన విశ్వరూపాన్ని చూపెనను. ఇది తన దైవ శక్తి ద్వారా ఏర్పాటు చేయబడినది. ఇది సామాన్య మానవుని ఊహాశక్తికి అందని విషయము. ఇంతకు ముందెన్నడూ ఈ రూపాన్ని ఎవరూ దర్శించలేదు. అర్జునుని కృపవలన ఇప్పుడు దేవతలు, ఉన్నత లకవాసులూ చూడగలిగినారు. అలాగే గురుపరంపరలోని ప్రతి ఆచార్యుడూ కృష్ణుని కృపచే దీనిని చూడగలుగుదురు. దుర్యోధనడి కి కూడా రాయబారిగా వెళ్ళినప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపాడు గాని అది దీనికి భిన్నమైనదని ఈ శ్లోకము ద్వారా మనము అర్థము చేసుకొనవచ్చు.

…పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement