Tuesday, April 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 20
20.
ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా: |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేందం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌ ||

తాత్పర్యము : నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వాని నడుమ గల ప్రదేశమునంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకమున్నియును కలతనొందుచున్నవి.

భాష్యము : ఇక్కడ ”ద్వాహ్‌, అపృధ్వీం:” అనగా భూమికి స్వర్గానికి మధ్య నున్న ఆకాశము. అలాగే ”లోకత్రయము” అనగా మూడులోకములు, అను ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైన విషయాలను తెలియజేయుచున్నవి. అర్జునుడే కాక ఇతరలోకాలలోని వాసులు కూడా విశ్వరూపాన్ని చూశారని అర్థమగుచున్నది. అనగా అర్జునుడు విశ్వరూపాన్ని చూడటమనేది కల కాదు. ఇలా ఎవరికైతే భగవంతుడు దివ్యదృష్టిని ఇచ్చాడో వారందరూ విశ్వరూపాన్ని చూడగలిగారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement