Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 07
07
కార్పణ్యదోషోపహతస్వభావ:
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా: |
యచ్ఛ్రేయ: స్సాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌ ||

తాత్పర్యము : కృపణత్వ దోష కారణమున నేనిపుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిపుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము.

భాష్యము : భౌతిక జీవితాన్ని దావానలముతో పోల్చబడింది. ఎవరూ నిప్పు అంటించకుండానే అడవిలో మంటలు రగులుకుంటాయి. అలాగే ఈ ప్రపంచములో ఎవరూ కోరుకోకుండానే మనస్పర్ధలు, అపోహలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. వీటిని ఆర్పివేసి జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే గురువును ఆశ్రయించవలెనని శాస్త్రాలు ఆదేశిస్తూ ఉన్నాయి. మానవ జీవితములో మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించుటకు అవకాశమున్నది. కాబట్టి మానవులు ‘కృపణ’త్వము వదిలి గురువును ఆశ్రయించి జీవిత సమస్యలన్నింటినీ సమూలముగా పరిష్కరించవలసి ఉన్నది. ఇక్కడ అర్జునుడు, అదే రీతిలో కృష్ణున్ని గురవుగా స్వీకరించి తన అయోమయాన్ని తొలగించమని శరణు వేడుకొనుచున్నాడు. అలాగే ప్రతిఒక్కరూ కృష్ణునికి గురువుద్వారా శరణాగతి పొందవలసి ఉన్నది. అట్లుకాక వక్రభాష్యములను చేయువారు భగవద్గీతను ఎప్పటికీ అర్థము చేసుకోలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement