Thursday, July 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 18

18
కర్మణ్యకర్మ య: పశ్యేత్‌
అకర్మణి చ కర్మ య: |
స బుద్ధిమాన్‌ మనుష్యేషు
స యుక్త: కృత్స్నకర్మకృత్‌

తాత్పర్యము : కర్మ యందు ఆకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్దిమంతుడైనవాడు. అట్టి వాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను దివ్యస్థితి యందున్నవాడే యగును.

భాష్యము : కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి సహజముగానే అన్ని కర్మ బంధనముల నుండి ముక్తుడై యుండును. కర్మలన్నీ శ్రీ కృష్ణుని ప్రీత్యర్థమే చేయబడి ఉండుటచే అతడు కర్మ ఫలితముగా వచ్చు సుఖదు:ఖాలకు లోను కాడు. కాబట్టి కృష్ణుని కొరకు అన్ని రకాల కర్మల యందు నిమగ్నమై ఉన్నా బుద్ధిమంతుడు గానే పరిగణింపబడును. కొందరు కర్మ ఫలితాలకు భయపడి కర్మలనే త్యజించును. అట్లు కాక కృష్ణుని కొరకే కార్యములు చేయుట వలన లేదా సేవా తత్పరత వలన దివ్యానందము పొందవచ్చును. వీ రే నిజమైన నిష్కాములు. శ్రీ కృష్ణుని యెడ గల నిత్యదాస్యస్వభావమే సర్వ విధములైన కర్మ ఫలములనుండి మనుజుని ముక్తుని చేయగలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement