Wednesday, May 1, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

అధ్యాయం 6, శ్లోకం 43

43.
తత్ర తం బుద్ధిసంయోగం
లభతే పౌర్వదేహికమ్‌ |
యతతే చ తతో భూయ:
సంసిద్ధౌ కురునందన ||

తాత్పర్యము : ఓ కురునందనా! అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు గత జన్మపు దివ్యచైతన్యమును పునరుద్ధించుకొని పూర్ణ విజయమును సాధించుట కు తిరిగి యత్నము కావించును.

భాష్యము : దీనికి మంచి ఉదాహరణము భరత మహారాజు చరిత్ర. ఆయన పేరు మీదుగనే నేడు దేవతలు సైతమూ మన ప్రదేశాన్ని భారత వర్షమని పిలుచుదురు. తొలుత గొప్ప రాజుగా పరిపాలించి ఆధ్యాత్మిక జీవనమును పాటించుటకు రాజ భోగాలను త్యజించి అడవులకు వెళ్ళెను. అయితే అపరిపక్వస్థితిలోనే దేహమును చాలించెను. ఆ తర్వాత జన్మలో బ్రాహ్మణ కుటుంబములో పుట్టి గొప్ప భక్తుడయ్యెను. ఈ విధముగా ఆధ్యాత్మిక పథములో, యోగపథములో మనము చేసే ప్రయత్నములు వృధా కానేరవు. పరిపూర్ణతను సాధించుటకు భగవంతుడు కృపతో మరల మరల అవకాశములనిచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement