Thursday, May 9, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

కార్యసిద్ధి — ప్రయోజనానికి విఘ్నేశ్వరారాధన గూర్చి డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

1. సకల లోకాలోని వారు తలపెట్టే కార్యాలకు కలిగే విఘ్నాలను తొలగించాలని వినాయకుడిని విఘ్ననాథుడిగా పరమశివుడు అనుగ్రహించాడు. విఘ్నము అనగా అనుకున్న పనికి ఆటంకం కలగడం. ప్రయోజనం ఆశించి పని తలపె ట్టడం సర్వసాధారణం. ప్రయోజనం అనగా కార్యసిద్ధి కలిగి, ఫలితం దక్కి, సంతోషం కలగడం. మంచి ముహూర్తానికి తలపెట్టిన పని పూర్తవడమే కాక సంపూర్ణ ఫలం దక్కాలి. వివాహం సుమూహూర్తానికి నిర్విఘ్నంగా జరగడమే కాక వారి వివాహబంధం కలకాలం సాగాలి అనగా వివాహ ఫలం దక్కాలి. జ్యోతిష్షాస్త్ర పండితుడైన రావణాసురుడు సీతను తలచిన విధంగా ముహూర్తానుసారం అపహరిం చాడు కాని ఫలితం పొందలేక పోయాడు. ఆ ముహూర్తంలో అపహరించినది ఏదైనా త్వరలో యజమానిని చేరుతుందని గ్రహించలేకపోయాడు.

ఫలితం కలిగినా సంతోషం, తృప్తి కలగకుంటే వ్యర్థం. తన తపస్సుతో స్వామిని ప్రత్యక్షం చేసుకున్న ధృవుడు తాను కోరుకున్న సర్వోన్నత స్థానాన్ని పొందగలిగాడుకాని తృప్తిని పొందలేకపోయాడు. పని జరిగినా ఫలితం దక్కనివాడు రావణాసురుడు, ఫలితం దక్కినా తృప్తి పొందలేకపోయినవాడు ధృవుడు. సంపూర్ణమైన కార్యసిద్ధి, ఫలితము, తృప్తి ఈ మూడింటి కలయిక ప్రయోజనం. తలచిన ప్ర యోజనం పొందాలంటే తగినంత పుణ్యం సంపాదించాలి. గణనాథుడు విఘ్నాలు వారిస్తాడు అనగా పాపాలను తొల గిస్తాడని అర్థం. కార్యసాధనకి అడ్డంకులు తొలగితే కార్యసిద్ధి తప్పక కలుగుతుంది. పంటలు పండాలన్నా, వర్షాలు కురవాలన్నా, సంతానం కలగాలన్నా ఉన్న అడ్డంకులు అనగా పాపాలు తొలగాలంటే భారతము, రామాయణము విని యజ్ఞ యాగాదులు నిర్వహించాలి. విఘ్న నాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని అర్థం. మన పాపాలను తొలగిం చి కార్యసిద్ధి కలిగిస్తాడు. తనను పూజించిన వారి పాపాలు తొలగించి పుణ్యం ప్రసాదిస్తాడు. ఈ విధంగా గణనాథుడు అంటే పాపగణానికి, పుణ్య రాశులకి నాథుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement