Thursday, November 7, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

దానపద్ధతి

19. దాతృయాచకయోర్భేద: కరా భ్యామేవ దర్శిత:ఏకస్యగ చ్ఛతా ధస్తాత్‌ ఉపర్యన్యస్య తిష్ఠతాదాతకు యాచకునికి భేదము చేతుల లోనే ఉన్నది. ఒకరి చేయి క్రిందుగా ఉంటుంది ఇంకొకరి చేయి పైన ఉంటుంది. ఇదే ఇద్దరిలో భేదము సామాన్యముగా ఇచ్చువాని చేయి పైన తీసుకొనువాని చేయు కిందుగా ఉండును అని భావిస్తారు. ఆ నిర్ణయము తప్పని చెప్పుటకే ఇందులో ‘ఏకస్య’ ‘అన్యస్య’ఒకరిది, ఇంకొకరిది అన్నారు కాని ఇచ్చువానిది, పుచ్చుకొనవానిది అనలేదు.ధర్మ శాస్త్రమున ఇచ్చే వాడే తానీయదలచుకున్న వస్తువును ధరించి చేతిని క్రిందుగా నుంచాలి. తీసుకొనేవాడే తన చేతిని పైన ఉంచి తీసుకొనాలని పద్మపురాణం ద్వారా తెలుస్తోంది. వస్తువులు దాత ఇస్తే దానిని తీసుకొని దాత పాపాన్ని కూడా తీసుకొని దాతకు గొప్ప పుణ్యాన్ని, దానము తీసుకొనే వాడే ఇస్తున్నాడు. పైన ఉండుట గొప్పతనమునకు, దాతృత్వమునకు సంకేతమైతే పుణ్యమును ఇచ్చి ఆ రెండు తీసుకొనేవాడే ఇస్తున్నాడు. అంతేకాదు దాత చేయి క్రింద ఉంటేనే దాతకు అహంకారము రాదు. తీసుకొనువాని చేయి పైన ఉన్నా తాను తీసుకొనువాడను అను భావము ఉండును గాన అహంకారము ఉండదు. ఇలా ఇద్దరూ ఇచ్చువారే ఇద్దరూ తీసుకొనవారే అన్న సమరస భావన ఇరువురిలో ఉంటే సమాజసంక్షేమమే కదా!శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులువాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement