శంకరుని జటాజుటము నుండి గంగను తీసుకువచ్చే విధానంలో పార్వతి ప్రయత్నం – గౌతమ మహర్షి ఆశ్రమ వైభవం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
గౌతమ మహర్షి ఆజ్ఞ వలన ఆయనచే ఆరాధింపబడిన త్రిమూర్తులు మరియు లోకమాతలయిన ఓషధులు అనుగ్రహించుట వలన పైరు నాటిన రెండు గంటలలో పంట చేతికి వచ్చుచుండెను. గౌతముని తపోబలంతో సంకల్పించుట వలన విత్తనం వేయుట, పైరు నాటుట, ఋషులు భుజించుట క్షణాలలో జరిగిపోవుచుండెను.
ఈ విధముగా కొన్ని సంవత్సరములు వారందరిని పోషించి గౌతముడు గొప్ప ఖ్యాతి పొందాడని పార్వతి వినాయకునితో పలికెను. గౌతమ మహర్షి దేవసభలో కీర్తించబడుతున్నాడని తపోబలంతో దేవతలు కూడా చేయలేని పనిని అతను చేయుచున్నాడని వినాయకుడు పలికెను. తపస్సుతో, తగిన ఉపాయంతో, చక్కని భక్తితో శివున్ని ఆరాధించి జటామండలం నుండి గంగను యాచించి తీసుకురాగల సమర్ధుడు గౌతమ మహర్షియేనని వినాయకుడు అభిప్రాయపడెను. ఆ మహర్షి ప్రభావంతోనే ఉత్తమ నది అయిన గంగా శంక రుని శిరస్సు నుండి బయటకు రాగలదని తలచిన వినాయకుడు సోదరుడైన కుమారస్వామి, సోదరి జయతో కూడి బ్రహ్మచారి వేషంలో గౌతమ మహర్షి ఆశ్రమానికేగెను.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి