Friday, May 3, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

పంచామృత స్నానముతో శ్రీహరిని అభిషేకించినచో కలుగు ఫలము

క్షీర స్నాపన మహాత్మ్యం వర్చస్కం పుష్టివర్థనమ్‌ |
దౌర్భాగ్యం విలయం యాతి క్షీరస్నానేనమే సుత ||

స్నాపయే న్మార్గశీర్షే మాం యోవై పంచామృతేన తు |
సనశోచ్యో భవేజ్జన్తుర్బంధునా భువి మానద ||

కపిలా క్షీరమాదాయ య: స్నాపయతి మాం సుత |
కపిలా శతదానస్య ఫలం ప్రాప్నోతి మానవ! ||

శంఖే తీర్థోదకం కృత్వా య: స్నాపయతి దేశిక! |
బిం దునాపి సహోమాసే స్వకులం తారయేద్ధి స: ||

- Advertisement -

కపిలం క్షీరమాదాయ శంఖే కృత్వాచ మానవ: |
య: స్నాపయతి మా భక్త్యా సర్వతీర్థ ఫలం లభేత్‌ ||

క్షీరస్నాపన మాహాత్మ్యం వర్చస్కరం పుష్టివర్థనము. నాకు క్షీరస్నానము చేయించినచో దౌర్భాగ్యము లయము పొందును. మార్గశీర్ష మాసమున పంచామృతముతో స్నానము చేయించినచో అట్టివారు ఈ భూమండలమున బంధువులతో విచారింపబడడు. అనగా అతనికి యే కొరత ఉండదు. కపిలా గోక్షీరమును తెచ్చి నన్ను స్నానము చేయించినచో నూరు కపిలా గోవులను దానము చేసిన ఫలమును లభించును. శంఖమున తీర్థోదకమును చేర్చి స్నానము చేయించనచో ఒక బిందువుతో చేయించననూ తన కులమును తరింపచేయును. కపిలా గోక్షీరమును తెచ్చి శంఖమున పోసి నన్ను భక్తితో స్నానము చేయించినవాడు సకల తీర్థ స్నాన ఫలమును పొందును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement