Saturday, October 5, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

గజానన వాహనంలోని అంతరార్థం..

రుచిని తెలిపే నాలుకను గెలిస్తే లోకాలను గెలవవచ్చు. తినవలసినంతే తిని, మాట్లాడాల్సినంత మాట్లాడితేనే అందరూ మనకు దాసులవుతారు. పెద్ద కాయము ఉన్న వినాయకుడికి చిన్న ఎలుక వాహనమవడం వెనుక అంతరార్థం ఏమనగా మనోబలం, దైవబలం ఉంటే ఎంతటి భారమైనా మోయవచ్చు. ఎంత బలమున్నా దైవబలం
లేనిచో వ్యర్థమని ఎన్నో అసుర వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి. దైవబలం లభిస్తే ఆవగింజ కొండనను మోస్తుంది దైవబలం నశిస్తే కొండ ఆవగింజను కూడా
మోయలేదనే సత్యాన్ని బోధించిన మూషికాసురుడు వినాయకునికి వాహనమయ్యాడు. వినాయకావతారం కోటి రహస్యాల పుట్ట. అందుకే గణపతికి కోటి దండాలు పెట్టి చ ల్లగా చూడమని కోరుకుం దాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement