Friday, May 17, 2024

సౌజన్యమూర్తి సుమిత్ర

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్‌|
అయోధ్యామ్‌ అటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్‌||
అంటే, లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను (సుమిత్ర) అనుకో, అడ వినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా! అని అర్థం.
ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది. రాము డు అరణ్యాలకి వెళ్తున్నాడని తెలిసి లక్ష్మణుడు, తను కూడా అరణ్యాలకు బయలుదేరు తూ, తన తల్లి సుమిత్ర ఆశీర్వాదం కోరినప్పుడు, సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధా నం ఈ శ్లోకం.
రామాయణంలో అత్యంత సౌమ్యమైన పాత్ర సుమిత్ర. ఈమె కాశీ రాజ్యపు రాకు మారి, దశరథుని భార్య. ఈర్ష్య, అసూయ, ద్వేషం అస్సలు లేని భార్యగా సుమిత్ర పేరు పొందింది. పుత్రకామేష్టి యజ్ఞ ఫలంగా ఈమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈమె కుమారుడైనందున లక్ష్మణుని ”సౌమిత్రి” అంటారు. రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కనిపిస్తా యి. వనవాసానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమె వద్దకు సెలవు తీసుకోవడా నికి వెళ్ళారు. అప్పుడామె దు:ఖిస్తూనే లక్ష్మణునితో- ”నాయనా, నువ్వు అడవులలో ఉం డడానికే పుట్టావు. అన్నావదినలకు ఏమీ ఆపద కలుగకుండా కాపాడుకో వారే నీ తల్లి దండ్రులు. సుఖంగా వెళ్ళిరా” అని ఆశీర్వదించి పంపింది. అసలు సుమిత్ర ఎవరు? అనే కథనంలోకి వస్తే-
కశ్యపుడు- అదితిలు శ్రీరాముని తన కుమారునిగా పొందుటకు మరో జన్మలో దశరధుడు, కౌసల్యగా జన్మించారు. ఆ సమయంలో రామునితో పాటుగా శ్రీ మహా విష్ణు అంశలు అయిన ఆదిశేషువు, శంఖము, చక్రములు కూడా లక్ష్మణ, భరత, శత్రుఘ్ను లుగా జన్మించారు. శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందుటకు కశ్యపుడు- అదితి తమ ముందు జన్మలో తపస్సు చేశారు. మరి సుమిత్ర, కైకేయిలకు శంఖం భరతునిగా, ఆది శేషుడు లక్ష్మణుడిగా, చక్రం- శత్రుఘ్నుడుగా జన్మించడానికి కారణం కశ్యపునికి, దక్షు డు తన 13మంది కుమార్తెలను ఇచ్చి వివా#హం చేశాడు. వారిలో అదితి, వినత, కద్రువ కూడా ఉన్నారు. ఐతే కశ్యప ప్రజాపతి తన భార్యలందరికి సమానమయిన సమయము ను కేటాయిస్తూ, ఎవరి సమయంలో వారివద్ద ఉండేలా ప్రణాళికతో నడచుకునేవాడు.
అయితే ఒకసారి కశ్యపుడు వినత దగ్గర ఉండగా, కద్రువకు కోపం వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు కద్రువ వద్ద ఉండాల్సింది. ఆ కోపం మొత్తం వినత మీద తీర్చు కోవటానికి కద్రువ వినతకు శాపం ఇచ్చింది. ఆమె శాపం ప్రకారం వినత గర్భంలో సర్ప ము, మంట జన్మించాలి. అయితే ఆ శాపం విన్న వినతకు కూడా కోపం వచ్చింది, ఆ కోపంలో కద్రువకు అత్యంత అపకీర్తి కలగాలని శపించింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన తమ అక్క, కశ్యపుని మొదటి భార్య అయిన అదితి వారిని వారించ ప్రయత్నించ గా, తన కోపం ఇంకా చల్లారని కద్రువ తన భర్త అయిన కశ్యపుడు, వినత మరియు అదితి కూడా మానవజన్మ ఎత్తవలసినది అని శపించింది. అయితే ఆ కోపములు శాంతించిన తరువాత వినత, కద్రువలు తమ తప్పు తెలుసుకుని, ఆ జరిగిన పొరపాటుకు పశ్చాత్తా పం చెంది శ్రీ మహావిష్ణువు గురించి అద్భుతమయిన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు, వారు మానవ జన్మ ఎత్తిన సమయంలో తానూ స్వయంగా వివిధ రూపములలో వారికి పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకార మే కౌసల్య (అదితి)కి రాముని (విష్ణువు)గా, సుమిత్ర (వినత)కు లక్ష్మణుడు (సర్పం- ఆది శేషుడు), శత్రుఘ్నుడు (అగ్ని- చక్రం-సుదర్శనం)గా, కైక (కద్రువ)కు భరతుని (శం ఖం)గా జన్మించాడు. కైక, రాముని వనవాసం పంపుట వలన తనకు అనంతకాలం వర కు తరగని అపకీర్తి ప్రాప్తించింది. ఎంతో ముందు చూపు గల సుమిత్రకు నారాయణుడు రాముడుగా జన్మించాడని, ఆయనకు సోదరులుగా శేషువు, శంఖం,చక్రం- లక్ష్మణ, భరత, శత్రఘ్నుల్లా జన్మించారని తెలుసు. వీరంతా లోకకల్యాణం కోసం జన్మించారని సుమిత్ర ముందే గ్రహంచగలిగింది.
బిడ్డల వనవాస గమనం వల్ల దు:ఖిస్తున్న కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. తండ్రిని సత్యవాదిని చేయడానికే రాముడు అడవులకు వెళ్ళాడని. ముల్లోకాలలోనూ గొప్పవా డైన రాముడు తప్పక తిరిగి వచ్చి తల్లి పాదాలు సేవిస్తాడని అనునయించింది. ఆమె దు: ఖాన్ని తన వచనామృత ప్రవాహంలో కొట్టుకుని పోవునట్లు చేసిన మహాసాధ్వి, ఉత్తమ ఇల్లాలు సుమిత్ర. క్షాత్ర ధర్మమెరుగని ధర్మ విలసితమైన వ్యక్తిత్వమున్న సౌజన్యమూర్తి సుమిత్ర. అంటే స్వచ్ఛమైన మిత్ర జీవితాన్ని తలపింపజేసేదని కదా అర్థం. ఆమె పవిత్ర మైన భావ సంయమనానికి ప్రతిరూపం.
కౌసల్యను ఓదారుస్తూ, రాముడు సుగుణాభి రాముడు. పురుషశ్రేష్ఠుడు. ఇహపర ముల యందు కీర్తిని ప్రసాదించే ధర్మాత్ముడు. ఆయన ధర్మాన్నుద్ధరించేందుకే అడవికి వెళ్ళాడు. రాముని తండ్రిగా భావిస్తూ కంటికి రెప్పలా చూచుకునే నా బిడ్డ లక్ష్మణుడు తోడుగా వెళ్ళాడు. అరణ్యాలలో కష్టాలన్నీ బాగా తెలిసిన సీత సేవాధర్మంతో భర్తను అను సరించి వెళ్ళింది. ధర్మం, సత్యం ఇవి రెండే ధనమని భావించిన సమర్థుడైన నీ కుమారు డు శ్రీరాముడు, తన కీర్తి పతాకాన్ని లోకంలో ఎగురవేస్తున్నాడు. రాముని వైభవాన్ని సూర్యుడెరిగినవాడే. కావున శ్రీరాముని శరీరాన్ని తన వేడి కిరణాలతో తరింపజేస్తాడు.
శ్రీరాముని ధర్మనిరతి తెలిసిన వాయుదేవుడు కూడ సమశీతోష్ణంగా సంచరిస్తూ ఆహ్లా దాన్ని కలిగిస్తాడు. చంద్రుడు కూడ రాత్రిపూట బయట పడుకుని నిద్రిస్తున్న రాము ని తన కిరణాలతో ఆనందింపజేస్తాడు. ఏ సంకోచం లేకుండా అరణ్య వాసాన్ని పూర్తిచేసు కుని వచ్చి రాజ్యాన్ని పొందుతాడు. సీతారాములు లక్ష్మీనారాయణులే కావున, వారికొర కు దు:ఖించడం సముచితం కాదని, రాముడు సాక్షాత్తు నారాయణుడనే భావాన్ని స్ప ష్టంగ వ్యక్తీకరిస్తుంది. ధర్మ ప్రవర్తన కల్గిన రామునికి జన్మనిచ్చిన నీవు ధన్యురాలవు అంటుంది. లక్ష్మణుడు సీతారాముల వెంట అడవికి వెళ్ళేటప్పుడు తల్లికి నమస్కరిస్తా డు. ఆమె లక్ష్మణుని శిరస్సును స్పృశిస్తూ వెళ్లు… వెళ్లు అన్నదేగాని వెళ్ళిరా అనలేదు. అలా అనడంలో ధర్మమార్గాన్ని అనుసరించు అన్న అర్థం ఉంది. రాముడు వనవాసం నుండి తిరిగి వస్తే లక్ష్మణుడు కూడ ఆయన వెంట తిరిగి వస్తాడు. ప్రయాణం చేస్తున్న యజమాని యొక్క వస్తు సామాగ్రి, అతడు తిరిగి రాగానే అది కూడ యజమానితో ఇం టికి వస్తుంది గదా! అదేవిధంగా లక్ష్మణుడూ రాముని సొత్తు కావున, రామునితో తిరిగి వస్తాడు. కాబట్టి ఆయనను వెళ్ళిరా అని చెప్పనవసరం లేదు. ఆ సందర్భంలో సుమిత్ర లక్ష్మణునికిలా బోధిస్తుంది. ”లక్ష్మణా! నీకు శుభమగుగాక. ఏమరుపాటు లేక సీతా రాములను కనిపెట్టుకుని ఉండు” అని. అలాంటి ఉత్తమ స్వభావాన్నే నేటి తల్లులు ఆదర్శంగా తీసుకోవాలి. మైత్రికి ప్రతిరూపమైన సుమిత్ర తాను బాధలో వున్నా, కౌసల్యను బాధల నుండి విముక్తురాలిని చేయడంలో కృతకృత్యురాలయింది. సుమిత్ర రామాయణంలో మనకు రెండుసార్లు సాక్షాత్కరిస్తుంది. లక్ష్మణుడు రామునితో వనవా సానికి వెళ్ళే ముందు తల్లికి నమస్కరిస్తాడు. అది మొదటిది. ఆ తర్వాత సీతారామలక్ష్మ ణులు అరణ్యానికి వెళ్లగా, దశరథుడు కౌసల్య మందిరంలో పరితపిస్తుండగా వారిని శాంతింపజేసేందుకు ఆమె చాకచక్యంగా మాట్లాడిన సందర్భం రెండవది.
‘సుమిత్ర’ అనే పేరు సంస్కృత మూలానికి చెందినది, దీనిని ‘సు’ అంటే ‘మంచి’ అని, ‘మిత్ర’ అంటే’ స్నేహతుడు’ అని విభజించవచ్చు. కాబట్టి, ఆమె పేరు ‘మంచి స్నేహ తురాలు’ లేదా ‘స్నేహపూర్వక స్వభావం కలిగినది’ అని అర్థం. ఆమె లక్ష్మణుని వంటి త్యాగధనుని ప్రపం చానికి ప్రసాదించిన త్యాగమయి. వ్యక్తిగత సుఖాలకన్నా ఉన్నతాశయాలకే ప్రాధాన్యత నిచ్చే సుమిత్ర పాత్ర మిక్కిలి విశిష్టమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement