Sunday, May 26, 2024

మే 3న చందనోత్సవం

విశాఖపట్నం, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి శుక్ర వారం బుగ్గన బొట్టుతో పెళ్లి కుమారుడుగా భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో స్వామిని దర్శించుకున్న భక్తులు పరవశించారు. ప్ర తీ ఏటా పాల్గున పౌర్ణమి రోజున సాంప్రదాయబద్ధంగా నిర్వహించే అప్పన్న డోలోత్సవం (పెళ్లిచూపులు) ఈ ఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవా రుజామునే సింహాద్రినాథుడిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగ ధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. తదుపరి సర్వాభరణాలతో సింహాద్రినా థుడిని చూడముచ్చటగా అలంకరించారు. వేదమం త్రోచ్ఛరణలు.. మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సిరులొలికించే సింహాద్రినాథుడిని కొండ దిగువకు తీసుకువచ్చారు. ఆలయ తొలిపావంచా వద్ద దేవస్థానం అధికారులు, గ్రామపెద్దలు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గ్రామంలోనికి సాదరంగా స్వాగతించారు. అక్కడ నుంచి నేరుగా స్వామి తన సోదరి అయిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోదరి కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని సింహాద్రినాధుడు కోరతా రు. అయితే తొలుత నిరాకరించినప్పటికీ సింహాద్రి నాథుడి మహిమాన్వితులని తెలుసుకొని తన కుమా ర్తెను ఇచ్చి వివాహం చేయడానికి అమ్మవారు అంగీ కరిస్తారు. ఆయా కార్యక్రమాలను పురాణ ఇతిహాస కథనాల ప్రకారం ఆలయ వర్గాలు అత్యంత వైభవంగా జరిపించారు. వివాహం నిశ్చయం కావడంతో స్వామి అక్కడ నుంచి సంతోషంగా బయలుదేరి పుష్కరిణి సత్రంలో ఆశీనులయ్యారు. అక్కడ ఆలయ స్థానాచా ర్యులు టి.పి.రాజగోపాల్‌, ఇన్‌ఛార్జి ప్రధానార్చకులు ఇరగవరపు వెంకటరమణమూర్తి, హవల్దార్‌ ఎస్‌. టి.పి.రాజగోపాల్‌, ఆలయ పురోహితుడు, అలంకారీ కరి సీతారామాచార్యులు, వేదపండితులు, అర్చక పరి వారం సంయుక్తంగా విశ్వక్ష్సేన ఆరాధనతోపాటు వసంతోత్సవం, చూర్ణోత్సవం, డోలోత్సవం తదితర కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. లోకానికి వెలుగులు పంచే సింహాద్రినాథుడికి వివాహం ఖరారు కావడంతో అర్చక వర్గాలు అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని కేరింతలు కొట్టారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా పానకం వడపప్పు, తదితర తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. స్వామికి వివాహం ఖరారు కావ డంతో సంతోషంగా గ్రా మంలోని అన్ని వీధు ల్లోనూ ఆలయ వర్గా లు తిరువీధి నిర్వ హించాయి. గ్రామ ప్రజలందరూ స్వామిని సాద రంగా స్వాగతించి మంగళహారతులు ఇచ్చారు. పసుపు కుం కుమలు సమర్పించు
కుని స్వామిని సేవించి దర్శి ంచుకున్నారు. అనంతరం మె ట్లు- మార్గం ద్వారా సింహాద్రినాథుడిని కొండపైకి తీసుకువచ్చారు. దేవా దాయ శాఖ అసిస్టెంట్‌ కమిష నర్‌ అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఏఈ ఓలు శ్రీనివాసరావు, రా ఘవకుమార్‌, ఆనంద్‌కుమా ర్‌, అప్పన్న ధర్మకర్తల మం డలి ప్రత్యేక ఆహ్వానితులు, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్య
క్షుడు గంట్ల శ్రీనుబాబు, మాజీ ట్రస్టీ రాగాల నరిసింగనాయుడు, ఇత ర పెద్దలు, గ్రామ ప్రజలు స్వామిని దర్శించు కుని సేవించి తరించారు.
12న స్వామి కల్యాణం..
మే 3న నిజరూప దర్శనం
ఉగాది పర్వదినం సందర్భంగా సిం హాద్రినాథుడిని పెళ్లి కుమారుడిగా అలంకరణ గావిస్తారు. ఆ రోజు నుంచి పెళ్ళి పనులు ప్రారంభి స్తారు. అదే రోజు స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయి. ఏప్రిల్‌ 12న సింహాద్రినాథుడు, శ్రీదేవి, భూ దేవి అమ్మవార్లతో స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిపిస్తారు. అదేవిధంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే తన నిజ రూపాన్ని సింహాద్రినాథుడు భక్తులకు దర్శ నమిస్తారు. మే 3న అప్పన్న నిజరూప దర్శనం (చందనోత్సవం) అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement