Wednesday, May 1, 2024

శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

కర్నూలు, ప్రభన్యూస్‌ బ్యూరో: మహాశివరాత్రిని పురస్కరిం చుకుని ఫిబ్రవరి 22 నుండి నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాల భాగంగా ఈ ఉదయం మల్లికార్జునస్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలో భాగంగా సాయంకాలం అశ్వవాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.
పుష్పోత్సవం-శయనోత్సవం
అంతకుముందు స్వామి,అమ్మవార్లకు పుష్పోత్సవం నిర్వహించారు. ఈ పుష్పోత్సవంలో స్వామి, అమ్మవార్లను 21 రకాల పుష్పాలతో విశేషంగా ఆర్జించారు. తరువాత ఏకాంత సేవను నిర్వహించి శయనోత్సవం కార్యక్రమం చేపట్టారు.
ఊయల సేవ
లోకకల్యాణం కోసం సాయంకాలం స్వామి,అమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించారు . ప్రతి శుక్రవారం పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ నిర్వహించబడు తుంది. ఈ కార్యక్రమంలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు . తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించబడింది . మహా గణపతి పూజ అనంతరం ఊయలలో విచ్చేసిన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార జరిపించబడింది. తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చనలు జరిపించబడ్డాయి. చివరగా ఊయలసేవ నిర్వహించబడింది. ఊయలసేవను పురస్కరించుకునిస్వామి,అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడ్డాయి . పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించబడ్డాయి.
నేటినుంచి ఆర్జిత సేవలుపున: ప్రారంభం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మో త్సవాలతో నేటి నుంచి ఆర్జిత సేవలు పున:ప్రారంభి స్తున్నట్లు- ఆలయ ఈవో లవన్న చెప్పారు. గర్భాలయ అభిషేక ములు, అమ్మవారి కుంకుమార్చనలు, వృద్ధమల్లికార్జునస్వామివార్ల అభిషేకం, గోపూజ, గణపతి హోమం, చండీహోమం, రుద్రహోమం , శ్రీవల్లీ దేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, విరామదర్శనం మొదలైన వన్నీ యథావిధిగా పున: ప్రారంభమవుతాయి. అక్క మహాదేవి, అలంకారమండపం శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్న కారణంగా సామూహిక అభిషేకాలను నిర్వహించే అవకాశం లేదు . 6 వ తేదీ నుంచి గతంలో వలనే సామూహిక అభిషేకాలు కూడా రోజూ మూడు విడతలుగా యథావిధిగా నిర్వహించనున్నట్లు- ఆయన వెల్లడించారు .అదేవిధంగా గతంలో వలనే స్వామివార్ల స్పర్శదర్శనం కూడా నేటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. కాగా వివిధ ఆర్జితసేవాటికెట్లను, విరామ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ తో పాటు- ఆ్లనన్‌ ద్వారా కూడా ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement