Friday, May 17, 2024

బాబా సందర్భోచిత సందేశాలు

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ”శ్రద్ధాభక్తులతో నాకు సర్వస్య శరణా గతి చేసి ఎవ్వరైనా పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని ఆఖరుకు నీరు గాని సమర్పించినచో దానిని నేను మిక్కిలి ప్రీతితో గ్రహించి వారిని ఆశీర్వదించెదను” అని పలికి ఉన్నా రు.
కలియుగ దైవం, సమర్ధ సద్గురువు, పరిశుద్ధ పర బ్రహ్మ అవతారం, సకల దేవతా స్వరూపి అయిన శ్రీ సాయినాథులు ఆ ప్రబోధాన్ని తన భక్తులకు ఆచరణ పూర్వకంగా తన అద్భుతమైన లీలల ద్వారా చూపిం చారు. శ్రీ సాయినాథుల ప్రత్యేకత ఏమిటంటే తన భక్తుడేదైనా తనకు సమర్పించవలెననుకొని, ఏ కార ణము చేతనైనా దానిని మరిచిపోతే, వారికి తగిన సందర్భంలో ఆ విషయం జ్ఞాపకం చేసి, ఆ నివేదనను గ్రహించి వారిని బంధ విముక్తులను చేసేవారు. అట్టి లీలను ఈ క్రింద స్మరించుకుందాము. రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్‌ అనే ఆయన తన యవ్వన దశలో ప్రార్ధనా సమాజస్థుడు, విగ్రహారా ధన అంటే ఏమాత్రం గిట్టనివాడు. కాని తర్వాత దశలో తనకు జరిగిన కొన్ని అద్భుతమైన అనుభవ ముల వలన బాబాకు ప్రియభక్తుడై నాడు. అతని కుటుంబ
సభ్యులు కూడా బాబాకు
ప్రియభక్తులే. ఒకసారి తల్లి కొడుకులిద్దరు శిరిడీకి వెళ్ళి సాయి సన్నిధిలో వేసవి సెలవలను గడుపవలె నని నిర్ణయించుకున్నారు. కాని కొడుకు మాత్రం ఈ ప్రయాణానికి మనస్పూర్తిగా ఇష్టపడలేదు. ఎందు కంటే తండ్రికి విగ్రహారాధ న అంటే ఇష్టం లేదు. ఈ నెలరోజుల పాటు తన తం డ్రి బాబా పూజను సరిగ్గా చేయకపోవచ్చునని సంశ యించాడు. కాని తాను తప్పక బాబా పూజను చేస్తా నని తండ్రి వాగ్దానం చేయ డంతో తల్లి కొడుకులు ఇరు వురు శిరిడీకి బయలుదేరి వెళ్ళారు.
ఆ మరునాడు శనివారం తర్ఖడ్‌ తెల్లవారు జామునే నిద్ర లేచి, స్నానాది కార్యక్రమములను ముగించుకొని, బాబా వారి పూజను అతి శాస్త్రోక్తంగా చేసాడు. నైవేద్యంగా అర్పించిన కలకండను అందరికీ పంచిపెట్టాడు. ఈవిధంగా మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో తర్ఖడ్‌ బాబా వారి పూజను చేసాడు. కొడుకుకు వాగ్దానం చేసిన విధంగా పూజ జరుగుతున్నందుకు ఒక పక్క, బాబా వారికి భక్తి శ్రద్ధ లతో పూజ చేయడం వలన కలిగే అలౌకిక ఆనందంను మరొక పక్క అనుభవిస్తూ సంతోషంగా వున్నాడు.
ఒక మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు తన నౌకరును పూజామందిరంలో బాబా వారి సన్ని ధిలో వున్న ప్రసాదాన్ని తీసుకుని రమ్మన్నాడు. నౌక రు పూజ గదిలోకి వెళ్ళి వచ్చి సాయిబాబా సన్నిధిలో ప్రసాదం లేదని చెప్పాడు. అప్పుడు తర్ఖడ్‌కు తాను ఉదయం సాయి బాబాకు పూజ చేసాక నైవేద్యం అర్పించలేదన్న విష యం జ్ఞాపకం వచ్చింది. వెంటనే తర్ఖడ్‌ లేచి బాబా వారి పటముకు సాష్టాంగ నమస్కారం చేసి నైవేద్యం సమర్పించనందుకు క్షమార్పణలు వేడుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని లేఖ రాసి బాబాను తన తరఫున క్షమార్పణలు వేడమని కోరుతూ శిరిడీలో వున్న తన కొడుకుకు పంపించాడు.
అదే సమయంలో శిరిడీలోని బాబా వారికి హారతి కార్యక్రమము ప్రారంభమవబోతోంది. అప్పు డు బాబా తర్ఖడ్‌గారి భార్యతో ”తల్లి! నాకు ఆకలిగా వున్నందున ఏమైనా తిందామని బాంద్రాలో వున్న మీ ఇంటికి వెళ్ళాను. తలుపు తాళము వేసి వున్నా ఎలాగో లోపలికి వెళ్ళి చూద్దును కదా అక్కడ తినుటకు ఏమి యూ లేదు” అని అన్నారు.
తర్ఖడ్‌ భార్యకు బాబా వారి మాటలు ఏమీ అర్ధం కాలేదు. కానీ ఆమె కొడుకుకు మాత్రం తన ఇంట్లో జరిగే బాబా పూజలో ఏవో లోటు పాట్లు జరిగినవని అర్ధమయింది. వెంటనే తన ఇంటికి తిరిగి పోవుటకు ఆజ్ఞ ఇవ్వమని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా అతనితో ”ఇంటికి పోనవసరం లేదు, ఆ పూజ ను నీవు ఇక్కడే చేయవచ్చును” అని అన్నారు.
బాబా వారు తనను క్షమించినందుకు తర్ఖడ్‌ కు మారుడు ఎంతో సంతోషించి తన తండ్రికి ఒక ఘాటై న లేఖను వ్రాసి బాబా పూజ చేయడంలో అసలే మాత్రం అశ్రద్ధ చేయవద్దని హెచ్చరించాడు. తండ్రీ కొడుకులు వ్రాసుకున్న ఉత్తరములు ఒకదానికొకటి మార్గమధ్యంలో ఎదురై దాటుకుంటూ మరొకరికి చేరుకున్నాయి.
ఈవిధముగా భక్తులెవరైనా బాబాకు ఏమైనా సమర్పించాలని సంకల్పిస్తే బాబా వారి నుండి ఏదో విధంగా ఆ వస్తువును స్వీకరించి వారిని ఆశీర్వదించే వారు. లేనిచో భగవంతునికి మొక్కుకున్నాక, దానిని తీర్చకపోతే నిష్కృతి లేని పాపాల బారి న పడవలసి వస్తుంది. తిరిగి ఆ పాప ఫల ములను అనుభవించుటకు మనము మరికొన్ని జన్మలను ఎత్తవలసి వస్తుంది.
ఈవిధంగా సాయిబాబా తన భక్తులకు సందర్భోచి తంగా సందేశాన్నందించే వా రు. భక్తులు పాపముల బారిన పడకుండా ఎల్లవేళలా కాపా డేవారు. బాబా వారి కరుణ, ద య, ప్రేమ పూరిత వాత్సల్యముల ను మనము ఏవిధంగా కొనియాడ గలము. వాటిని పరిపూర్ణముగా పొందిన భక్తులు ఎంతటి అదృష్టవంతులు. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.

  • సి.హెచ్‌.ప్రతాప్‌, 95508 51075
Advertisement

తాజా వార్తలు

Advertisement