Saturday, June 22, 2024

అన్నమయ్య కీర్తనలు : నీదాసుల భంగములు

రాగం : మల

నీదాసుల భంగములు నీవుజూతురా
ఏదని చూచేవు నీకు నెచ్చరించవలెనా|| ||నీదాసుల భంగములు||

పాలసముద్రము మీద పవ్వళించినట్టి నీకు
బేలలై సురలు మొరవెట్టిన యట్టు
వేళతో మా మానవులు విన్నవించితిమి నీకు
ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాదా|| ||నీదాసుల భంగములు||

ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు
బీరాన ద్రౌపది మొరవెట్టినయట్టు
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి
యేరీతి పరాకు నీకు ఇంకా రక్షించరాదా|| ||నీదాసుల భంగములు||

- Advertisement -

ఎనసి వైకుంఠములో ఇందిరకూడున్న నీకు
పెనగి గజము మొరవెట్టిన యట్టు
చనవుతో మా కోరికె సారె విన్నవించితిమి
విని శ్రీ వేంకటేశుండ వేగ రక్షించరాదా|| ||నీదాసుల భంగములు||

Advertisement

తాజా వార్తలు

Advertisement